NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: అందరి ముందు విక్కీని ఇబ్బంది పెట్టిన పద్మావతి.. విక్కీ ఏం చేయనున్నాడు?

Nuvvu Nenu Prema today episode 22 November 2023 episode 474 highlights

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, కృష్ణ ఏదో ఒక విధంగా విక్కి ఆస్తిని కాల్ చేయాలి అనుకుంటాడు. కృష్ణ విక్కీ దాచిన పేపర్స్ ని దొంగతనంగా తీసుకోవడానికి ట్రై చేస్తాడు. లాకర్ ఓపెన్ అవ్వకపోవడంతో, కీస్ ని డూప్లికేట్ చేయించుకోవడానికి వెళ్తూ ఉంటాడు. కృష్ణని అరవింద ఆపుతుంది. అరవింద కు అనుమానం రాకుండా కృష్ణ మేనేజ్ చేస్తాడు.అరవింద కోసం విక్కీ పద్మావతి మెడలో తాళి కట్టి, అత్తారింటికి వస్తాడు. చాలా సరదాగా ఇద్దరు ఆడుతూ ఉంటారు. వాళ్లని చూసి పార్వతి, భక్తా సంతోషిస్తారు.

Nuvvu Nenu Prema today episode  22 November 2023 episode 474 highlights
Nuvvu Nenu Prema today episode 22 November 2023 episode 474 highlights

ఈరోజు474 ఎపిసోడ్ లో, పద్మావతి తో విక్కీ, నువ్వు నన్ను భర్తగా యాక్సెప్ట్ చేసిన నేను మాత్రం నిన్ను భార్యగా అంగీకరించలేను నువ్వు నన్ను అలా పిలవద్దు అని అంటాడు. దానికి పద్మావతికి చాలా కోపం వస్తుంది భర్తని ఏమండీ అని పిలవకుండా ఏమని పిలవాలి అని, అన్ని భాషల్లో భర్తని ఏమంటారు అన్ని రకాలుగా తను చెప్తూ ఉంటుంది. ఇంకా ఆపుతావా అని అంటాడు విక్కి. సరే ఇతర భాషల గురించి మనకెందుకు మన తెలుగు భాషలోనే సామి అని పిలవమంటారా అంటుంది. లేదంటే నాదా అని పిలవమంటారా అని అంటుంది. విక్కీ కి కోపం వచ్చి అవన్నీ ఏమి పిలవక్కర్లేదు అని అంటాడు. మిమ్మల్ని పిలవకపోతే నాకేం తోచదే అని అంటుంది పద్మావతి. నువ్వు మామూలుగా పిలిస్తేనే నాకు కంపరంగా ఉంటుంది ఇక ఇన్ని భాషల్లో పిలిస్తే నాకు ఇంకా కోపం గా ఉంటుంది అని అంటాడు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అంటుంది. నువ్వేం చేయక్కర్లేదు తప్పుకో అని పద్మావతిని ఒక్కసారిగా పక్కకు తోసేసి వెళ్తాడు. దెబ్బకు పద్మావతి గర్రు న తిరిగి కింద పడుతుంది.

Nuvvu Nenu Prema: పద్మావతి కోసం విక్కీ అత్తారింటికి వెళ్ళనున్నాడా? విక్కీ మనసు పద్మావతి గెలుచుకోనుందా?

Nuvvu Nenu Prema today episode  22 November 2023 episode 474 highlights
Nuvvu Nenu Prema today episode 22 November 2023 episode 474 highlights

ఇది నా అడ్డ.. అన్న పద్మావతి..

ఇక పద్మావతి, ఈ తింగరోని నా చుట్టూ తిప్పుకుందామనుకుంటే నాకే తల తిరిగేలా చేస్తున్నాడు అని అనుకుంటుంది. ఏంది సారు అలా అదో చేశారు ఇది ఎవరు అడ్డా అనుకుంటున్నారు ఇది నా అడ్డా, మామూలు ఇల్లు మీ ఇంట్లో ఉన్నట్టు ఉండాలంటే ఇక్కడ కుదరదు అని, పద్మావతి అంటుంది వెంటనే విక్కీ నీ అడ్డా అయితే ఇది నీ అడ్డా అని రాసి పెట్టారా ఏంటి ఇక్కడ నువ్వు కూతురివి నేను అల్లుడ్ని అని అంటాడు. ఏంటి అల్లుడికి ఎక్కువ మర్యాద ఉంటుంది అని అంటాడు. దానికి పద్మావతి ఏమన్నారు సారూ మళ్లీ అనండి అని అంటుంది. చెప్పాను కదా ఏంటి అల్లుడిని ఏంటి అల్లుడికి ఎక్కువ మర్యాద ఉంటుంది నీ కన్నా కూడా అని అంటాడు. ఏం చెప్పారు సారు నేను చెప్తుంది కూడా అదే కదా ఏంటి అల్లుడు అంటే నా భర్త కదా నేను అదే కదా మొత్తుకునేది అని అంటుంది. నేను ఎప్పటినుంచో అడుగుతుంది మీ భారీ స్థానమే కదా అది ఇప్పటికి ఇచ్చారు అన్నమాట అని అంటుంది పద్మావతి. మరి ఎక్కువగా ఊహించుకోకు పద్మావతి ఆర్య ఇంటికి అల్లుడు అల్లుడు అన్నయ్య ఏమవుతాడు అల్లుడే అవుతాడు కదా, నేను ఆ ఉద్దేశంతో అన్నాను మన బంధం గురించి కాదు అని అంటాడు. ఆ మాటకి పద్మావతి కోపం వస్తుంది. ఎలా మీ భార్యని కాదంటారో చూస్తాను అని అనుకుంటుంది మనసులో, నేను చెప్పే దానికి నువ్వు ఇంకో విధంగా ఆలోచించకు అని అంటాడు విక్కి.

Nuvvu Nenu Prema: విక్కీ ఆస్తి మీద కన్నేసిన కృష్ణ.. అరవింద కోసం అత్తారింట్లో విక్కి..మారిపోయిన ఆర్య..

Nuvvu Nenu Prema today episode  22 November 2023 episode 474 highlights
Nuvvu Nenu Prema today episode 22 November 2023 episode 474 highlights

విక్కీ కోసం స్పెషల్ డైట్..

వంటింట్లో అందరూ వంట చేస్తూ ఉంటారు అప్పుడే ఆండాలు మీ వారు ఎక్కడ అని అడుగుతుంది పద్మావతిని, వస్తారు అత్త ఏం వంట చేస్తున్నారు అని అడిగితే, నాన్ వెజ్ వండుతున్నాను అని చెప్తుంది ఆండాలు అయ్యో నాన్ వెజ్ వండుతున్నారా, మా వారి కోసం ప్రత్యేకంగా నేనే వంట చేస్తాను అని అంటుంది. అదేంటో నాకు చెప్పు నేనేం చేస్తాను అని అంటుంది పార్వతి వద్దమ్మా ఆయనకి ఒంట్లో బాగాలేదు అప్పటినుండి ఆయన ప్రత్యేకంగా డైట్ ఫాలో అవుతున్నారు అది మీకు ఎవరికీ తెలియదు కదా అందుకని నేనే వండుతాను అని అంటుంది. అయినా ఏం చేస్తాం అమ్మ తన కోసం నేను కూడా త్యాగం చేయాల్సి వస్తుంది అని అంటుంది. ఏమైందమ్మి ఇప్పుడు అని అడుగుతుంది పార్వతి. ఆయనకి ఒంట్లో బాగా లేనప్పటి నుండి నాన్ వెజ్ మానేయమన్నారు డాక్టర్స్ ఆయన కోసం నేను కూడా మానేశాను అని అంటుంది పద్మావతి. చిలకమ్మా భర్త మీద ఎంత ప్రేమ అని అంటుంది. ప్రేమ ఉన్నది కాబట్టే కదా ఆయన కోసం నేను కూడా మానేసింది అయినా మీరు తప్పకుండా మా ఆయనకి స్పెషల్గా వంట చేసి పెట్టాలి అని అంటుంది. చిలకమ్మ పద్మావతిని ఆటపట్టిస్తూ ఉంటుంది. ఆ డైట్ ఏంటో నాకు చెప్పండమ్మా అని అంటుంది చెప్పను చేసి చూపిస్తా అంటుంది పద్మావతి.

BrahmaMudi November 21 Episode 259: కళ్యాణ్ కోసం అప్పు సూసైడ్ చేసుకుందా? రాహుల్ ప్లాన్ బి సక్సెస్.. అందరి ముందు దోషిగా స్వప్న.. రేపటి ఎపిసోడ్ లో సూపర్ ట్విస్ట్..

Nuvvu Nenu Prema today episode  22 November 2023 episode 474 highlights
Nuvvu Nenu Prema today episode 22 November 2023 episode 474 highlights

విక్కీని ఇరికించిన పద్మావతి..

ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు చాలా ఘుమఘుమలు వాసన వస్తుంది. ఏమంటారు అని ఆర్య అడుగుతాడు వెంటనే చిలకమ్మా మీకోసం నాన్ వెజ్ చేశారయ్యా మీ అత్తమ్మ అని అంటుంది. వెంటనే అందరూ కూర్చుంటారు ఇక విక్కీ కూడా చాలా ఆకలిగా ఉండడంతో ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తూ ఉంటాడు అప్పుడే పద్మావతి ఉడికిన కూరగాయ ముక్కల్ని పెడుతుంది. పక్కన ఒక గ్లాసులో కాకరకాయ జ్యూస్ పెడుతుంది. భార్య ఎదురుగా కూర్చుని విక్కీకి నాన్ వెజ్ కంచంలో పెట్టుకొని, కలుపుకుంటూ ఉంటే విక్కీ కి నోరూరుతుంది ఇదేంటి వాడికే మాది పెట్టారు నాకేమో ఇది పెట్టారు అని అంటాడు. అంటే సారు మీ ఆరోగ్యం బాగాలేదు కదా అప్పటినుంచి మీరు ఇవే తింటున్నారు కదా అందుకనే మీ ఆరోగ్యం కోసం ఇది పెడుతున్నాను అని అంటుంది పద్మావతి. వాట్ అని అంటాడు విక్కీ అదే సారూ మీకోసమే నేను కూడా నాన్ వెజ్ మానేశాను నాకోసం మీరు నాన్ వెజ్ మానేశారు అని అంటుంది పద్మావతి. కావాలనే పద్మావతి అవి పెట్టిందని విక్కీ అర్థం చేసుకుంటాడు ఇది చేసేదేం లేక అందరిలో ఇలా ఇరికించింది నన్ను అని మనసులో అనుకుంటూ, ఆ క్యారెట్ ఆకులు తింటూ ఉంటాడు. కానీ ఎదురుగా ఆర్య నాన్వెజ్ కలుపుకొని తింటుంటే ఆ విక్కీకి నోరు ఊరుతుంది. పద్మావతి వైపు కోపంగా చూస్తాడు తప్పదు సార్ మీరు దారిలోకి రావాలంటే నేను ఇలానే చేయాలి అని అనుకుంటుంది మనసులో, విక్కీ మాత్రం పద్మావతి నువ్వు చేసిన దానికి తర్వాత చెప్తాను నీ సంగతి అని అనుకుంటాడు. వెంటనే తినడం అయిపోయింది కదా ఆ జ్యూస్ తాగేయండి అని అంటుంది ఆ జ్యూస్ నోట్లో పెట్టుకోగానే చాలా చేదుగా ఉంటాయి ఒక్కసారిగా విక్కీ ఏం జ్యూస్ అని అంటాడు. మీ హెల్త్ డైట్లో జ్యూస్ కూడా ఉంది కదండీ కాకరకాయ జ్యూస్ మీకోసమే చేశాను తాగండి అని అంటుంది. విక్కీ చాలా కోపం ఉన్నా కానీ అందరి ముందు పద్మావతిని అరగడం ఇష్టం లేక ఒకపక్క బాగా ఆకలితో ఉండి, నాన్ వెజ్ తినాలనిపించి తినలేక చాలా అవస్థలు పడుతూ ఉంటాడు.

Naga Panchami 2023 Episode 206: మోక్ష నీకు దగ్గర కావాలని చూస్తే నా పూరలతో కాటు వేసి చంపేస్తాను అని బెదిరిస్తున్న ఫణీంద్ర.

Nuvvu Nenu Prema today episode  22 November 2023 episode 474 highlights
Nuvvu Nenu Prema today episode 22 November 2023 episode 474 highlights
ఆండాళ్ అచ్చుత్సాహం..

ఇక ఆండాలు, పాపం అల్లుడుగారు అవన్నీ తినలేకపోతున్నట్టు ఉన్నారు అని అంటుంది పద్మావతి అదేం లేదు అత్త మాకు అలవాటే మేము ఇంట్లో కూడా ఇదే తింటున్నాము అని అంటుంది. ఇక చేసేదేం లేదా విక్కీ బాగా ఆకలిగా ఉండి చమట్లు పడుతూ ఉంటాయి అవే తింటూ ఉంటాడు. వెంటనే ఆడాలి అబ్బాయికి చెమట పోస్తున్నట్టుంది చిలకమ్మా వెళ్లి ఆ కూలర్ ఆన్ చేయి అని అంటుంది. కూలర్ ని హాల్లోకి చిలకమ్మ ఈడ్చుకుంటూ వస్తుంది ఆ సౌండ్ కి విక్కీ చాలా ఇరిటేట్ గా ఫీల్ అవుతాడు. ఏంటి ఆ సౌండ్ అని అడుగుతాడు చూస్తే చిలకమ్మా కూలర్ ని తీసుకొస్తూ ఉంటుంది. మీకోసమే బాబు మీ కోసమే ఇదంతా అని అంటుంది పార్వతి. ఇక పద్మావతి కూలర్ ఆన్ చేస్తారు ఉండండి సారు అని అంటుంది. చిలకమ్మ కూలర్ ఆన్ చేస్తుంది కొంచెం సేపు అయ్యేసరికి విక్కీకి ఇంకా చెమట పోస్తూనే ఉంటుంది అయ్యో అబ్బాయికి ఇంకా చెమట తగ్గినట్టు లేదు చిలకమ్మా చూడు అని అంటుంది. ఏమో అమ్మ నాకు తెలియదు అని అంటుంది చిలకమ్మా వెంటనే పార్వతి నువ్వు వెళ్లి చూడు అని అంటుంది. పార్వతి వెళ్లి వదిన గాలు రావట్లేదు ఏం చేయాలి అని అంటుంది కూలర్ కున్న పక్కన స్విచ్ ని గట్టిగా తిప్పు అని అంటుంది అండాలు, అలానే వదిన అని పార్వతీ కూలర్ లో నుంచి గాలి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆండాలు తను అత్యుత్సాహంతో ఇప్పుడు ఎలాగైనా సరే నేనే చేయాలి అన్నట్టుగా అక్కడికి వచ్చి నువ్వు తప్పుగా పార్వతి నీకేం తెలియదు ఇందాకటి నుంచి తిప్పుతున్నావు అయినా కానీ ఒక రవ్వ కూడా గాడు రావట్లేదు అల్లుళ్ళు అల్లాడిపోతున్నారు చెమటకి, అని ఆండాలు, కూలర్ కున్న స్విచ్ ని గట్టిగా తిప్పుతుంది కూలర్ మీదట చేతితో కొడుతుంది విక్కీ ఆర్య ఇద్దరు చాలా ఇరిటేట్ గా ఫీల్ అవుతుంటారు. ఇక కూలర్ స్విచ్ కాస్త ఊడిపోయి చేతిలోకి వస్తుంది ఇక అందరూ ఆండాలు వైపు చూస్తారు . నేను ఒకటి చేద్దాం అనుకుంటే ఇంకోటి అయింది అని అంటుంది పర్వాలేదులే అని అంటుంది పద్మావతి.

Malli Nindu Jabili November 21 2023 Episode 500: పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన శరత్ ని మీరాని ఇంట్లోకి వసుంధర రానిస్తుందా లేదా.

న్యాప్కిన్ వద్దు చీర కొంగే ముద్దు..

ఇక ఆర్య భోజనం చేసి, చెయ్యి కడుక్కోడానికి వంట గదిలోనికి వెళ్తాడు అక్కడ టాప్ ఉంటుంది కానీ వాటర్ రావు, అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆండాలు చూసి ఆ అబ్బాయి ఫీల్ అయినట్టున్నాడు కూలర్ సరిగా గాలి రాలేదని నువ్వు వెళ్లి సర్ది చెప్పమ్మా అని అంటుంది అట్లే అత్త అని పద్మావతి, విక్కీ దగ్గరికి వంట గదిలోనికి వెళుతుంది ఏంటి సారీ చూస్తున్నారు చేయి కడుక్కోడానికా ఆ టాప్ లో వాటర్ రావు, దానికోసమే కదా పక్కన నీళ్లు పెట్టి ఉన్నాము అని నేను పోస్తాను ఉండండి అని అంటుంది. అప్పటికే బాగా కోపంగా ఉన్నవి కి ఏం అవసరం లేదు అని తనే వాటర్ తీసుకొని చేయకడుకుంటాడు. ఏంటి సార్ కోపంగా ఉన్నారా అని అంటుంది. నువ్వు చేసిన పనికి కోపంగా ఉండక ఎలా ఉంటారు అని అంటాడు. మీ ఆరోగ్యం కోసమే కదా సారు నేను చేసేది అని అంటుంది. అప్పుడే చెయ్యి తుడుచుకోవడానికి నాప్కిన్ ఎక్కడ అని అడుగుతాడు. నాప్కిన్ ఎందుకు సారు నా చీర కొంగుతో తుడుచుకోండి అని అంటుంది. వాట్ నేనేంటి, నీ చీర కొంగుకు తుడుచుకోవడం ఏంటి నెవర్ అని అంటాడు విక్కీ. న్యాప్కిన్ వద్దు చీర కొంగే ముద్దు సార్ అని అంటుంది. నువ్వు నాకేం ఇస్తావా లేదా అని అంటాడు అప్పుడే అక్కడికి చిలకమ్మా వస్తుంది. చిలకమ్మా నువ్వు చెప్పు మీ ఆయన అన్నం తిన్న తర్వాత చేయి కడుక్కొని దేనికి తుడుచుకుంటాడు అని అంటుంది. ఇంక దేనికి తలుచుకుంటాడు అమ్మాయిగారు నా చీర కొంగుకే తుడుచుకుంటాడు. అయినా అందరూ చేసే పనే కదా అమ్మగారు ఒకసారి చీర కొంగు పట్టుకొని ఇక వదలను అంటే వదలనుంటాడు. ప్రతి భర్త చేసే పనే కదమ్మా అది. ఇప్పుడేంటి బాబు గారు మీ చీర కొంగుకు తుడుచుకోవాలి అంటున్నారా బాబు గారు నాప్కిన్ కన్నా చీర కొంగే, బెస్ట్ బాబు గారు అని అంటుంది ఇక అంతలో చిలకమ్మ నాకు పనుంది అమ్మ మీ సంగతి మీరు చూసుకోండి అని అంటుంది. విక్కీ పద్మావతి చీర కొంగిస్తే తుడుచుకోకుండా పక్కకు తిరిగి నిలబడి ఉంటాడు. అప్పుడే అక్కడికి ఆండాలు వస్తూ ఉంటుంది ఆండాలని గమనించిన విక్కి వీళ్ళ ముందు మనం నాటకం ఆడాలి లేదంటే వీళ్ళకి డౌట్ వస్తుంది అని అనుకొని వెంటనే పద్మావతి చీర తీసుకొని తుడుచుకుంటూ ఉంటాడు. అది చూసి ఆండాళ్, పార్వతి సంతోషిస్తారు.

రేపటి ఎపిసోడ్ లో, పద్మావతికి అరవిందా వీడియో కాల్ చేస్తుంది. పద్మావతి ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను మీరే కాల్ చేశారు అని అంటుంది. ఎలా ఉన్నారు అని అడుగుతుంది అరవింద బాగున్నాము అని అంటుంది పద్మావతి మా తమ్ముడు ఏం చేస్తున్నాడు అని అంటుంది. అప్పుడే విక్కీని చూపిస్తుంది పద్మావతి ఏంటి చాలా కోపంగా ఉన్నాడు అని అంటుంది. మా అమ్మ కూరలో కొంచెం కారం ఎక్కువ వేసి ఉన్నది అది తినేటప్పటికి విక్కీ కి కోపం వచ్చింది అన్నట్టు చెప్తుంది. అరవింద కూరలో కారం ఎక్కువైతే మా వాడికి కోపం అట్లానే ఉంటుంది అని అంటుంది. ఆ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలుసులే వదిన అని అంటుంది. ఎలా పొగుడుతానో చూడండి వీడియో కాల్ లోనే అరవింద లైన్లో ఉండగా విక్కీకి ముద్దు పెడుతుంది పద్మావతి. అరవింద కళ్ళు మూసుకుంటుంది. విక్కీ షాక్ అవుతాడు.

Related posts

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N