Om Bheem Bush OTT Release: ప్రస్తుత కాలంలో థియేటర్లో విడుదలైన సినిమాలు అతి తక్కువ సమయంలోనే ఓటిటి ప్లాట్ ఫారంస్ ను ఆశ్రయిస్తున్నాయి. అలా థియేటర్లో రిలీజ్ అయిన 20 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుంది సూపర్ హిట్ కామెడీ మూవీ ” ఓం భీమ్ బుష్ “. ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని సోమవారం అనగా ఏప్రిల్ 8 అమెజాన్ ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన ఈ సినిమాకు తొలి రోజు నుంచే మంచి రెస్పాన్స్ దక్కింది. ఓం బీమ్ బుష్ మూవీ వచ్చే శుక్రవారం అనగా ఏప్రిల్ 12 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రానుంది.
ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రైమ్ వీడియో నే స్వయంగా అనౌన్స్ చేసింది. ఈ మూవీ ఓటిటి హక్కులను తాము దక్కించుకున్నట్లు మూవీ రిలీజ్ కి ముందే చెప్పిన ప్రైమ్ వీడియో ప్రస్తుతం డిజిటల్ ప్రీమియర్ తేదీని వెల్లడించింది. శ్రీహర్ష కొనుగంటి ఈ మూవీను డైరెక్ట్ చేశాడు. ” ముగ్గురు శాస్త్రవేత్తలు.. ఓ వైల్డ్ ట్రెజర్ హంట్.. గందరగోళం ఖాయం ” అనే క్యాప్షన్ తో ఈ మూవీ యొక్క డిజిటల్ ప్రీమియర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది ప్రైమ్ వీడియో. ఈ సినిమా ముగ్గురు డాక్టరేట్లు అయిన క్రిష్, వినయ్, మాధవ్ లచుట్టూ తిరుగుతుంది. థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ మూవీ ఓటిటి రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
మార్చ్ 22న ఓం భీమ్ బుష్ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ క్యాప్షన్ నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్. దానికి తగినట్లుగానే సినిమా లాజిక్ లేకుండా బాగా నవ్వించి మ్యాజిక్ చేస్తుంది. సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా కాలేజీ సీన్స్ తో నవ్వులు తెప్పించారు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తన కామెడీ టైమింగ్ తో మరోసారి అదరగొట్టారు. అయితే కథ పరంగా కాకుండా కేవలం కామెడీ పరంగా చూస్తే సినిమా హిలేరియస్ గా ఉంటుంది. నవ్వించడంలో మరోసారి బ్రోచెవారెవరురా కాంబోను రిపీట్ చేశారు. ఇక ఈ మూవీ ప్రేక్షకులను బాగా నవ్వించి ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కు ఈ మూవీ బాగా నచ్చుతుంది.
లాజిక్ గురించి పక్కన పెడితే కేవలం కామెడీ చూస్తే ఈ మూవీ హైలెట్ అని చెప్పుకోవచ్చు. తొలి రోజు సోషల్ మీడియా ఎక్స్ ద్వారా కూడా ఆడియన్స్ పాజిటివ్ రివ్యూలే ఇచ్చారు. దీంతో ఈ మూవీకి భారీ కలెక్షన్స్ ఏర్పడడం మొదలయ్యాయి. ఈ మూవీ 12వ తారీకు నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది. ఇక ప్రస్తుత కాలంలో థియేటర్లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఓటీటీలో సరైన రెస్పాన్స్ దక్కించుకోకపోతే ఆ మూవీని ఫ్లాప్ అని అంటూ ఉంటున్నారు. అలాంటి మూవీస్ ఇప్పటికే ఎన్నో సినిమాలు ఉన్నాయి. థియేటర్లో మంచి విజయం సాధించి అనంతరం ఓటిటిలో ఫ్లాప్ అయిన సినిమా స్ చాలానే ఉన్నాయి. మరి అటువంటి లిస్టులో ఈ సినిమా చేరకుండా ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుందో లేదో చూడాలి.