OTT Release: ప్రతివారం ఓటీటీలలోకి అనేక సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే ఎక్కువగా ప్రేక్షకు ఆదరణ పొందగలుగుతున్నాయి. ఇక ప్రతివారం డిఫరెంట్ కంటెంట్ అండ్ యూనిక్ కంటెంట్ తో అలరిస్తున్నాయి ఓటీటీ ప్లాట్ఫారంస్. ఇప్పుడు మరో వారంలోకి అడుగుపెట్టేసాం. మరికొన్ని చిత్రాలు రాబోతున్నాయి. అయితే వీకెండ్ కు ముందు రోజు ఓటీటీలో ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ఈ శుక్రవారం అంటే ఏప్రిల్ 12న ఏకంగా 11 సినిమాలు ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలేంటి వాటి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ వీడియో:
ఓం బీమ్ బుష్ (తెలుగు కామెడీ మూవీ) – ఏప్రిల్ 12
ఎన్డబ్ల్యుఎస్ఎల్ (ఒరిజినల్ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 12
నెట్ఫ్లిక్స్ ఓటిటి:
రజనీకాంత్ లాల్ సలాం (తమిళ్ డబ్బింగ్ మూవీ) – ఏప్రిల్ 12
అమర్ సింగ్ చమ్కిలా(హిందీ మూవీ) – ఏప్రిల్ 12
గుడ్ టైమ్స్ (యూనిమేటెడ్ సిట్ కామ్) – ఏప్రిల్ 12
లవ్ డివైడెడ్ ( స్పానిష్ రొమాంటిక్ కామెడీ మూవీ) – ఏప్రిల్ 12
స్టోలిన్ ( స్వీడిష్ మూవీ) – ఏప్రిల్ 12
ఊడీ ఉడ్ పెక్కర్ గోస్ టు క్యాంప్ 2024 ( కిడ్స్ యాక్షన్ యానిమేషన్ సిరీస్) – ఏప్రిల్ 12
లాల్ సలామ్ సన్ ఎన్ఎక్స్టీ ఓటిటి ప్లాట్ఫామ్ – ఏప్రిల్ 12
గామి (తెలుగు మూవీ) – జీ5 ఓటీటీ – ఏప్రిల్ 12
ప్రేమలు (తెలుగు వర్షన్) – ఆహా ఓటిటి ఏప్రిల్ 12
ప్రేమలు తమిళ్, మలయాళం, హిందీ వెర్షన్ – డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీ – ఏప్రిల్ 12
హైటౌన్ సీజన్ 3( హాలీవుడ్ వెబ్ సిరీస్) – జియో మూవీ – ఏప్రిల్ 12
ఈ 11 సినిమాలు ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్నాయి. ప్రస్తుతం పెరిగిన ఓటీటీల హడావిడి మూలంగా ఈ సినిమాలకి మంచి హైప్స్ ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీస్ లో ప్రతి ఒక్కరి ధ్యాస ప్రేమలు మరియు గామి పైనే ఉన్నాయి. ఈ రెండు మూవీలు థియేటర్లలో మంచి టాక్ అందుకోవడంతో ఈ మూవీస్ ఓటిటి రిలీజ్ పై ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలే కాకుండా తెలుగులో ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఓం బీమ్ బుష్ వంటి సినిమాలపై కూడా మంచి హైప్సే ఉన్నాయి. ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ అయి అనంతరం 20 రోజుల కే ఓటీటీలోకి వస్తుంది. ఇక ఈ మూవీ కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇలా థియేటర్లలో విజయవంతమైన రెస్పాన్స్ దక్కించుకున్న సినిమాలన్నీ ప్రస్తుతం ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ మూవీలు థియేటర్లలో అయితే మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి.. మరి ఓటిటిలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుంటాయో చూడాలి.