ఈ ఆధునిక కాలం లో మనిషి జీవితం లో ఒత్తిడి అనేది ఒక భాగం గా మారిపొయిన్ది.. ఒత్తిడిని జయిస్తూ గమ్యాన్ని చేరుకోవాలని పెద్దలు చెప్తుంటారు. విపరీతమైన ఒత్తిడి తో కొందరు అఘాయిత్యాలకు పాల్పడిన వారున్నారు. ఒత్తి డివల్ల శృంగార సమస్యలు తెచ్చుకుంటున్నారని ఓ స్టడీ వెల్లడించింది. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఈ సమస్య ని ఎదుర్కొంటున్నారని స్టడీ వెల్లడించింది. శృంగారం అనే పదం ను భూతంగా చూడటం వల్ల చాలా ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారని ఆస్ట్రేలియాలోని ఓ స్టడీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
శృంగారం అనే పదాన్ని సైతం వాడడం కూడా అదేదో నేరంలా భావిస్తున్నారని స్టడీ లోతేలింది. పాశ్చాత్య దేశాల్లోలా కాకుండా భారత్ లో శృంగారం గురించి మహిళలు ఎక్కువగా చర్చించకపోవడం వలన అవగాహన లేక పలు వ్యాధులకు గురవుతున్నారని స్టడీ లోవెల్లడైనది. 18 ఏళ్ల నుంచి 39 ఏళ్ల లోపు ఉన్నస్త్రీలు లైంగిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు వివరించింది. ఒత్తిడి వల్ల స్త్రీలు తమ శృంగార జీవితాన్ని కూడా పూర్తి స్థాయిలో అనుభవించలేక పోతున్నారని స్టడీ ద్వారా తెలుస్తోంది.
కొన్ని మ్యాగజీన్లపై వచ్చే మహిళా మోడల్స్ ఫోటో ల ప్రభావం సాధారణ మహిళలపైపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వారు తక్కువ అందం గా ఉన్నామని తమలో తాము భావించి ఒత్తిడికి లోనవుతున్నారని స్టడీ బయట పెట్టింది . మహిళల్లో శృంగార కోరికలు, ఉద్వేగం, ఉద్రేకం ఉన్నా కూడా మనస్సులో ఓ మూలనా తాము అందంగా లేమనే భావన వారిని శృంగార జీవితానికి దూరం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో 3వేల మంది మహిళల అభిప్రాయం సేకరించడం జరిగింది. కనీసం వారానికోసారి లేదా అంతకు మించి శృంగారంలో పాల్గొంటున్న మహిళల్లో కచ్చితం గా సమయానికి పీరియడ్స్ అవుతున్నాయని స్టడీ పేర్కొంది. అదే సమయంలో నెలకోసారి శృంగారంలో పాల్గొంటున్న మహిళల్లో పీరియడ్స్ ప్రక్రియ సరైన సమయంలో లేదా క్రమంగా ఉండటం లేదని స్టడీ బయట పెట్టింది .