Face Pack: అసలే ఎండాకాలం.. బయట వేడి తట్టుకోలేక మీ ముఖం వాడిపోతుందా..? అందుకే పాల విరుగుడుతో మేము చెప్పే ఈ చిట్కాలు పాటిస్తే మీ పేస్ అందంగా మారడంతో పాటు చల్లగా కూడా ఉంటుంది. పాలవిరుగుడులో లాక్టో యాసిడ్ ఎక్కువగా ఉండడం వలన ఇది చురుకుగా చర్మం లోపలికి వెళ్లి మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. అలాగే చర్మం పై ఉన్న మృతకణాలను తొలగించడంతో పాటు బ్లాక్ హెడ్స్ ను కూడా నివారిస్తుంది మరి. పాల విరుగుడుతో ఎలాంటి పేస్ మాస్క్ లను పేస్ కు అప్లై చేయవచ్చో తెలుసుకుందామా..!
Face Packs: అట్టు, ఇడ్లీ పిండి అందానికి కూడా..! ఇలా ట్రై చేయండి..!
Face Pack: శనగపిండి, మజ్జిగతో పేస్ ప్యాక్ :
ముందుగా ఒక గిన్నెలోకి శనగపిండిని తీసుకుని అందులో మజ్జిగ పోసి కలిపి ముఖానికి రాసుకోవాలి. లేదంటే శనగలను పాలలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం మిక్సిలో వేసి మెత్తగా రుబ్బి అందులో చిటికెడు పసుపును వేసి పేస్ కి అప్లై చేయాలి. ఈ మాస్క్ని అప్లై చేయడం వల్ల మీ చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఈ ప్యాక్ అన్ని చర్మ రకాలకు అనుకూలంగా ఉంటుంది.
Face Pack: 5 రూపాయలకే పార్లర్ లాంటి ఫేషియల్ గ్లో..
పాల విరుగుడు, రోజ్ వాటర్ పేస్ ప్యాక్ :
మరో ప్యాక్ ఏంటంటే రెండు టేబుల్ స్పూన్లు పాలవిరుగుడును ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ జోడించి అందులో ఒక చుక్క టీ ట్రీ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. ఆ తరువాత ముఖానికి బాగా మర్దన చేసి ముఖం కడిగేస్తే చాలు. అలాగే 1 టీస్పూన్ మజ్జిగ, 1 టీస్పూన్ టొమాటో రసం తీసుకుని బాగా మిక్స్ చేసి కాటన్ తో ముఖానికి అప్లై చేసి 30 నిమిషాల పాటు ఉంచుకుని తర్వాత కడిగేయాలి. బాగా ఎండలు వేసే సమయంలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత ఈ చిట్కాను అప్లై చేస్తే మీ చర్మం మృదువుగా మారడంతో పాటు అందంగా మెరిసిపోతుంది.