Health care: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రతి చిన్న సమస్యకు కూడా మెడికల్ షాప్ లో దొరికే ఇంగ్లీష్ మందులు వాడటమో లేక హాస్పిటల్ కు పరిగెత్తడమో చేస్తున్నాము. నిజానికి ప్రతి చిన్న సమస్యకు ఇలా మెడిసిన్ పై ఆధారధపడడం వలన మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది.అంతేకాకుండా శరీరంలోని అవయవాల పనితీరు కూడా మందగస్తుంది. నిజానికి మనకి వచ్చే ప్రతి అనారోగ్య సమస్యకు మన ఇంట్లోనే నేచురల్ మెడిసిన్లు ఉన్నాయి. కానీ వాటి గురించి మనకు సరైన అవగాహన లేక మందులపై ఆధారపడుతున్నాము.
ఆరోగ్యంగా ఉండాలంటే మనం చేయాలిసిన పనులు :
మన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ముందు మనం
బయట ఫుడ్ ను తీసుకోకుండా ఉండాలి. అలాగే డీప్ ఫ్రై, ఫాస్ట్ ఫుడ్ ను, సిగరేట్, మందు తీసుకోకపోవడం మానేయాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మన శరీరానికి తగినట్లుగా ప్రతి రోజు వ్యాయామాలు చేస్తూ ఉండాలి.ప్రస్తుత కాలంలో చాలా మంది యూరిక్ యాసిడ్,క్యాల్షియలోపం,నిద్రలేమి, ఆకలి లేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం. మన అందరికి బాదం బంక గురించి తెలిసే ఉంటుంది.దీనినే ‘కటోర’ అని కూడా అంటూ ఉంటారు
బాదం బంకను ఎలా వాడాలంటే..?
బాదం బంక ఎక్కువగా ఆయుర్వేదిక్ షాప్ లో, అన్ని సూపర్ మార్కెట్స్ లోను మనకు అందుబాటులో ఉంటుంది. ఈ కటోరాను 10 ముక్కలు తీసుకొని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టుకోవాలి. మరసటి రోజు ఉదయానికల్లా నానబెట్టిన కఠోర కాస్త జల్ గా తయారవుతుంది. దీనిలోని సగం జల్ తీసుకొని వేరే గ్లాసులో వేసుకొని అందులో ఒక స్పూన్ పటికపొడిని గాని లేదంటే తేనెను గానీ వేసి గిలకొట్టాలి.. ఆ తరువాత ఈ మిశ్రమంలో వేడి చేసిన పాలు పోసి కలుపుకుంటే మిల్క్ షేక్ లా తయారవుతుంది.దీనిని ప్రతిరోజు ఉదయం పూట త్రాగడం వలన నిద్రలేమి,ఆకలి లేకపోవడం,మలబద్ధకం, యూరిక్ ఆసిడ్ వంటి వ్యాధులు తగ్గుతాయి. అంతేకాకుండా ఈ కఠోర మిల్క్ షేక్ తాగడం వలన జీర్ణ కోశ సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి.అలాగే శరీరంలో ఉన్న వేడి పోయి శరీరం చల్ల.బడుతుంది. ఈ బాదం బంకను స్వీట్ లాగా తయారు చేసుకుని తినవచ్చు లేదంటే జ్యూస్ లాగా కూడా తయారు చేసుకొని త్రాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.