NewsOrbit
హెల్త్

అధికబరువుని తగ్గించుకుంటూ  మెరిసిపోయే చర్మాన్ని ,జుట్టుని పొందాలంటే ఇవి తింటే చాలు..!

అధికబరువుని తగ్గించుకుంటూ  మెరిసిపోయే చర్మాన్ని ,జుట్టుని పొందాలంటే ఇవి తింటే చాలు..!

శరీరానికి, చర్మానికి సంబంధించిన ఎన్నో సమస్యలు ఈ గింజల వల్ల దూరం అవుతాయి. అంతేకాకుండా డైట్ అనుసరించే వారికి ఎంతో మంది డైటీషియన్లు కూడా వాళ్ళ డైట్ ప్లాన్ లో గింజలను కచ్చితంగా ఉండేలా చూసుకోమని సలహా ఇస్తూ ఉంటారు. గుమ్మడికాయ గింజలలో ప్రోటీన్స్, ఒమెగా త్రీ, ఒమెగా సిక్స్ ఫ్యాటీ ఆసిడ్స్ఉంటాయి. ఐరన్, క్యాల్షియం, ఫోలేట్,బెటా కెరోటిన్ కూడా ఉంటాయి. వీటివల్ల శరీరానికి విటమిన్ ఏ లభిస్తుంది.

అధికబరువుని తగ్గించుకుంటూ  మెరిసిపోయే చర్మాన్ని ,జుట్టుని పొందాలంటే ఇవి తింటే చాలు..!

ఈ గింజల్లో యాంటీఆక్సిడెంట్స్, మెగ్నీషియం, జింక్, ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు మేలు చేస్తాయి. ఈ గింజల్లో… నీటిలో కరిగిపోయే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.ఈ గింజల్లో ఫైబర్ ఉంటుంది. అది బరువు పెరుగుదలను కంట్రోల్ చేస్తుంది. కొన్ని గింజలు తిన్నా చాలు పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. ఫలితంగా బరువు కంట్రోల్‌లో ఉంటుంది. ఈ గింజలు జీర్ణక్రియను బాగా ఉపయోగ  పడతాయి.

పొద్దుతిరుగుడు గింజలో యాంటీఆక్సిడెంట్స్ ,విటమిన్ ఇ కూడా ఉంటుంది . దాని వల్ల వ్యాధులురావు . అలాగే బరువు తగ్గాలనుకొనే వారు ఇవి తప్పకుండా తీసుకోవాలి.  ఎందుకంటే ఈ గింజల్లో ఫ్యాట్ తగ్గించే గుణం ఉంటుంది . అలాగే గుండెకు, చర్మానికి కూడా ఎంతో మంచిది . శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. వీటిలో ఫైబర్,కొలెస్ట్రాల్ తగ్గేందుకు సహకరిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతాయి. జుట్టు బాగా పెరిగి… హెయిర్ లాస్ అరికట్టవచ్చు. జుట్టు తెల్లబడే సమస్యకు కూడా ఈ గింజలు చక్కటి పరిష్కారం.

కలోంజి లో విటమిన్, B1, B2, B3 లతో పాటు కాల్షియం, ఫోలిక్ ఆసిడ్, ఐరన్, కాపర్, జింక్, పాస్పరస్, వంటి పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ న్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది.వీటిలో మొటిమలను తగ్గించే గుణం ఉంటుంది . అలాగే డయాబెటిస్ ఉన్నవారు తరచుగా కలోంజి  గింజలని తీసుకుంటే డయాబెటిస్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. ఆస్తమా తగ్గడం తో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి . బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ లో ఉంచుతాయి. అలాగే మూత్రపిండాల సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉండవు.నువ్వుల గింజలు నువ్వల నూనెలో ఉన్న విటమిన్ – ఇ, విటమిన్ – బి లు దెబ్బతిన్న శరీర కణజాలాలను రిపేర్ చేస్తుంది. చర్మం మెరుపులీనేలా చూస్తుంది. రోజూ నువ్వుల నూనె వాడడం వల్ల చర్మ సంబంధ క్యాన్సర్లను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. జుట్టు బాగా పెరుగుతుంది. జీర్ణక్రియ కూడా సక్రమంగా ఉంటుంది. నువ్వుల గింజలు తీసుకోవడం వల్ల ఎముకలు కూడా బలంగా ఉంటాయి.

అవిసె గింజలు తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే బ్లడ్ ప్రెషర్, చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా అవిస గింజలు క్యాన్సర్ నుండి కూడా దూరంగా ఉంచుతాయి .అధిక బరువు తగ్గించడంలో అవిసె గింజలు చాలా బాగా పనిచేస్తాయి.

వీటిలో పీచు మరియు ఒమేగా 3ఫ్యాటీ సమృద్ధిగా లభిస్తాయి ఇవి మన శరీరంలో ఉండే కొవ్వును త్వరగా కరిగించివేస్తాయి అలాగే అవిసె గింజల్లో ఉండే మ్యుసిలెజ్ అనే పీచు పదార్థం త్వరగా నీటిలో కలిసి మన కడుపులో ఉండే ప్రేగులకు అద్భుతంగా సహాయపడుతుంది అలాగే ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేసి ఆకలి మరియు ఆహారాన్ని తినాలనే కోరికను తగ్గిస్తుంది తద్వారా బరువు తగ్గించడంలో సహాయం చేస్తుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri