Balakrishna: నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు. భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో కెరీర్ 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై బాలయ్య అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇక అసలు మేటర్ ఏమిటంటే.. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారం అయిన నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ థియేటర్ రిలీజ్ అనంతరం నెట్ ఫ్లిక్స్ లో తెలుగు భాషతో పాటు గా, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకులని అలరించనుంది.
ఇక ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫార్ సినిమాస్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.