బన్నీని బాలీవుడ్ పిలిచింది. అయితే అది సినిమా కోసమా? అనేది మాత్రం ఇప్పుడప్పుడే చెప్పలేం. కాకపోతే బన్నీని పిలిచింది మాత్రం `బాట్లా హౌస్` డైరక్టర్ నిఖిల్ అద్వానీ. ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి కలెక్షన్లు తెచ్చుకుంది. దాంతో చిత్ర యూనిట్ స్పెషల్ పార్టీని అరేంజ్ చేసుకుంది. ఆ చిత్ర యూనిట్‌తో పాటు కొంతమంది సెలబ్రిటీలు కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. దక్షిణాది నుంచి అల్లు అర్జున్ పాల్గొన్నారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఆల్రెడీ హిందీలో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడికి హీరో హోదాలో వెళ్లాడా? నిర్మాతగారి అబ్బాయిగా వెళ్లాడా అనేది తెలియాల్సి ఉంది.
ఆ సంగతి పక్కనపెడితే `బాట్లా హౌస్` దర్శకుడు నిఖిల్‌కి అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, డ్యాన్స్ మూవ్మెంట్స్ అంటే చాలా ఇష్టమట. ఆ విషయాన్ని హీరోతో చాలా సేపు చెప్పాడట. అల్లు అర్జున్ కూడా ఎక్కువ సేపు ఆ పార్టీలో ఉన్నట్టు సమాచారం. దానికి తోడు సినిమా తీసుకుంటున్న షేపుల గురించి కూడా అక్కడివారితో ఆయన డిస్కస్ చేసినట్టు వినికిడి.
నిఖిల్ అద్వానీ కనుక అల్లు అర్జున్‌కు ఓ మంచి కథ చెబితే అల్లు అర్జున్ ఆ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెడతారా? వెయిట్ అండ్ సీ అంటున్నారు సన్నిహితులు.
previous post