బాలీవుడ్ కథానాయకుడు హృతిక్ రోషన్ నటించిన బయోపిక్ `సూపర్ 30`. గణిత మేధావి ఆనంద్ కుమార్ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. వికాస్ భల్ దర్శకుడు. ఈ సినిమాను ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ.. ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. చివరకు జూలై 12న సినిమా విడుదలవుతుంది. అంతా ఓకే అనుకున్న సమస్యలో.. ఇప్పుడు మరో కొత్త సమస్య విడుదలకు అడ్డుపడుతుంది. అదేంటంటే.. సినిమాలో కొన్ని సన్నివేశాలను ఐఐటీ విద్యార్థులను తక్కువ చేసి చూపేలా ఉందని గౌహతీకి చెందిన ఐఐటీ విద్యార్థులు హైకోర్టులో కేసు వేశారు. కేసును పరిశీలించిన కోర్టు దర్శక నిర్మాతలను వివరణ అడిగింది. మరి చిత్ర యూనిట్ ఈ సమస్యను ఎలా అధిగమిస్తుందో వేచి చూద్దాం.
previous post
next post