Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క ఏపీ రాజకీయాలలో బిజీగా ఉన్న మరో పక్క ఆయన సినిమాల వార్తలు అభిమానులకు ఎంతగానో ఊరటనిస్తున్నాయి. మొన్ననే “OG” సినిమా సెప్టెంబర్ 27వ తారీకు రిలీజ్ అవుతుందని ప్రకటన చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం ఇటీవల “హరిహర వీరమల్లు” షూటింగ్ కి సంబంధించి విజువల్ గ్రాఫిక్స్ వర్క్ పనులు పట్టణాలలో మరి కొన్ని దేశాలలో జరుగుతున్నట్లు ప్రకటన విడుదల చేశారు. అదే సమయంలో త్వరలో స్పెషల్ ప్రోమో రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు శివరాత్రి సందర్భంగా మార్చి 8వ తారీకు “హరిహర వీరమల్లు” స్పెషల్ ప్రోమో రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో సరికొత్త వార్త ఇప్పుడు బయటపడింది.
గతంలోనే ఈ సినిమాకి సంబంధించి కొన్ని స్పెషల్ వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలలో పురాతన కాలం నాటి యుద్ధ విద్యలు తరహాలో పవన్ కళ్యాణ్ పోరాట సన్నివేశాలు ఉన్నాయి. ఈసారి అంతకుమించి అన్న రీతిలో “హరిహర వీరమల్లు” స్పెషల్ ప్రోమో ఉండబోతున్నట్లు సమాచారం. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖుషి సినిమా నిర్మాత ఏఏం రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో బందిపోటు దొంగ పాత్రలో నటించినట్లు వార్తలొస్తున్నాయి.
ఈ స్పెషల్ ప్రోమో లోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటించబోతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో జనసేన పార్టీ కార్యక్రమాలలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో.. పలు రాజకీయ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఎన్నికలు అయిపోయినా వెంటనే ఈ సినిమాకి సంబంధించి మిగతా బ్యాలెన్స్ వర్క్ పవన్ పూర్తి చేయనున్నారు అంట. ప్రస్తుతం మాత్రం పూర్తిగా రాజకీయాల పైన దృష్టి పెట్టడం జరిగింది.