రాజమాత శివగామిగా `బాహుబలి`లో మెప్పించిన రమ్యకృష్ణ ఇప్పుడు `క్వీన్`గా అందరినీ మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి, దివంగత జయలలిత జీవితం ఆధారంగా `క్వీన్` ను తెరకెక్కిస్తున్నారు. ఎం ఎక్స్ ప్లేయర్ ఈ వెబ్‌సీరీస్‌ను నిర్మిస్తోంది. మొత్తం మూడు భాగాల్లో ఈ వెబ్ సీరీస్ ఉండబోతోంది. ఫస్ట్ సీజన్లో 12 ఎపిసోడ్లు ఉంటాయి. వాటిలో ఐదు ఎపిసోడ్లు గౌతమ్ మీనన్ తెరకెక్కించినవి. ఇంకో ఐదు ప్రశాంత్ తెరకెక్కించినవి. రెండు మాత్రం ఇద్దరు కలిసి చేసినవి. శనివారం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో రమ్యకృష్ణ జనాలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నట్టుగా ఉంది. ఆమె వీపు, జడ మాత్రం కనిపిస్తున్నాయి. ఆమె ముఖం కనిపించలేదు. అయినా ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫస్ట్ లుక్‌ను రమ్యకృష్ణ స్వయంగా రిలీజ్ చేశారు. ఈ వెబ్‌సీరీస్ ఎప్పటి నుంచి టెలికాస్ట్ అవుతుందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
previous post
next post