Samantha: “నా మీద కేసు పెడతావా .. నా దగ్గర ఆధారం ఉంది ఇదిగో ” అంటూ ప్రెస్ మీట్ పెట్టాడు ఈయన

Share

Samantha: సమంత, నాగచైతన్య తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. వీరు తమ విడాకులను అధికారికంగా ప్రకటించి 20 రోజులు గడుస్తోంది. అయినప్పటికీ ఈ జంట విడాకుల వ్యవహారంపై ఇప్పటికీ అనేక కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రెండు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ తో పాటు అడ్వకేట్ డా. వెంకట్రావు సమంత విడాకులు తీసుకోవడానికి ఇదే కారణమంటూ ఏవేవో కారణాలు చెప్పాడు. దీంతో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహించిన సమంత ఆ రెండు యూట్యూబ్ ఛానళ్లతో పాటు డాక్టర్(doctor) వెంకట్రావుపై కూకట్‌పల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసింది. ఈ నేపథ్యంలో నా మీద కేసు పెడతావా నా దగ్గర ఆధారం ఉంది ఇదిగో అంటూ న్యూస్ అనలిస్ట్ కమ్ అడ్వకేట్ వెంకట్రావు ప్రెస్ మీట్ (press meet) పెట్టాడు. ప్రస్తుతం అతని ప్రెస్ మీట్ సంచలనం సృష్టిస్తోంది.


Samantha : సమంత జీవితాన్ని మార్చేయబోతున్న ఆ ఇద్దరు..?

సమంతపై విడాకులకు ఆధారాలివిగో: వెంకట్రావు

‘నాగ చైతన్య రాముడు మంచి బాలుడు టైపు.. కానీ సమంతానే తొందరపడి అతనితో తన వివాహ బంధాన్ని తెంచుకుని తప్పు చేసింది’ అని వెంకట్రావు తన 13 నిమిషాల వీడియోలో పేర్కొన్నాడు. సమంత పరువు నష్టం కేసు దాఖలు చేసే సరికి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రపంచస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో జరిగే అన్ని అంశాలపై తాను విశ్లేషిస్తానని.. అందుకే సమంతా(Samantha) వ్యవహారం పై కూడా తన విశ్లేషణ ఇచ్చుకున్నానని చెప్పుకొచ్చాడు. తాను మేధావి వర్గానికి చెందిన వాడినని.. అందుకే తాను ఎప్పుడూ కూడా ఆధారాలు లేకుండా ఎలాంటి వ్యాఖ్యలు చేయనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


Samantha – Naga Chaitanya: నాగ చైతన్య కోసం సమంత అన్ని త్యాగాలు చేసిందా …?

“సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఇలా ప్రతి ఫ్లాట్ ఫాం నుంచి కీలక విషయాలను లేదా ఆధారాలను సేకరించి వాటిని క్రోడీకరించి విశ్లేషణ చేశాం. ఆమెతో పాటు ఆమె సన్నిహితులు చేసిన ట్వీట్లను విశ్లేషించడంలో తప్పేముంది. సమంత బెడ్ రూమ్ లో జరిగే విషయాలను ట్వీట్ చేసింది. వాటిపై విశ్లేషణ చేయమని కోరితేనే చేశాను. విడాకుల తర్వాత స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్‌ ట్వీట్ పెట్టాడు. ఇవన్నీ ఎందుకు పెట్టాలి. ఈ విషయాల గురించి ఎందుకు బయట చర్చించాలి. అసలు ఇవన్నీ లేకపోతే విశ్లేషణలు రాకపోయి ఉండేవి కదా. ఒక వివాహిత భారత సంప్రదాయ కట్టుబాట్లను దాటి ప్రవర్తించకూడదు” అని వెంకట్రావు అన్నాడు.

అయితే కేవలం సమాజహితం కోసమే తాను విశ్లేషణ చేశానని.. ఎవరి వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా తాను తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని ఏదో పిచ్చి సమర్ధత ఇచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ఆధారాలు ఏవి? అని ప్రశ్నిస్తే.. తాను ఇంటి బయట అడుగు పెట్టి ఏవేవో ఆధారాలు సేకరించే పోలీసును కాదని.. ఇంట్లో కూర్చుని గూగుల్ నుంచి మాత్రమే ఆధారాలు సేకరిస్తారని చెప్పాడు. తన దగ్గర ఉన్న ఆధారాలు అదేనని స్పష్టం చేశాడు.
Samantha: నాగచైతన్య కోసం అంత పెద్ద బాలీవుడ్ ఆఫర్ వదులుకున్న సమంత.. అయినా విడిపోవాల్సి వచ్చింది..!

సమంత నెక్సస్టెప్ ఏంటి

సమంత తన వ్యక్తిగత జీవితంపై మచ్చ పడేలా.. తన పరువుకు భంగం వాటిల్లేలా అసత్య ప్రచారాలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేసింది. కానీ ఎంత మొత్తం అనేది ఇప్పటి వరకు నిర్ణయించుకోలేదని సమాచారం. ఇకపై తనపై ఎవరు కూడా అసత్య ప్రచారాలు చేయకూడదన్నట్లు ఆమె తన పిటిషన్లో పేర్కొంది. పిటిషన్ విచారణకు వచ్చేంత వరకు ఆమె వేచి చూసి తనపై వస్తున్న అసత్య కథనాలను కట్టడి చేసే అవకాశం ఉంది.


Share

Related posts

YS Sharmila: అన్న కోసం శక్తికి మించి చేశాను షర్మిల కీలక వ్యాఖ్యలు..!!

sekhar

జగన్ – పీకే మీటింగ్ గుట్టు ఇదే..! కేటీఆర్ తో కూడా కీలక చర్చలు..!?

Srinivas Manem

MP Raghu Rama: జగన్ బెయిల్ రద్దు పిటిషన్.. హైకోర్టు తీర్పు రేపటికి వాయిదా..!!

somaraju sharma