తాజా వార్త
మొన్న రాత్రి ఇద్దరు ఆడవాళ్లు బారుకి వెళ్ళేరు
పీకలదాకా తాగి ఒళ్ళు తెలీకుండా నడి రోడ్డుమీద దెబ్బలాడుకున్నారు
పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చెయ్యలేకపోయేరు
ఆఖరికి ఎలాగో వాళ్ళని పోలీస్ స్టేషనుకి తీసుకెళ్ళేరు
మర్నాడు కౌన్సెలింగుకి పంపించేరు
అయ్యా పోలీసులూ మీఅమాయకత్వం కాని ఆ లెవెల్లో ఉన్నవాళ్లు కౌన్సిలింగ్‌కి మారుతారా మీ వెర్రికాని
మనది భారతదేశం పుణ్యభూమి పవిత్ర భూమి అని ఒకప్పుడు డబ్బా కొట్టేం
అసలు మ్యాపులో ఇండియా ఉందా అమెరికాలో కలిసిపోయిందా
గాంధీ ఏవన్నావు నువ్వు
అర్థరాత్రి ఆడది ఒంటరిగా బైట తిరగ్గలిగిన నాడే మనకి స్వతంత్రం వచ్చినట్టు అని కాదూ
అసలు ఆడది అర్థరాత్రి ఎందుకు తిరుగుతుంది
అంత అవసరం ఐతే ఎవరినైనా సాయం తెచ్చుకుంటుంది
దొంగలే రాత్రి తిరుగుతారు
స్వతంత్రం అంటే ఆడవాళ్లు అర్థరాత్రి తాగి తందనాలాడ్డం కాదు
అయ్యా చలం గారూ మీరేవన్నారు
స్త్రీకి శరీరం ఉంది మనసు ఉంది దానికి స్వేచ్ఛ కావాలి అని కదూ
స్వేచ్ఛ ప్రతి ప్రాణికి కావాలి
ఇదేనా మీరు ఆశించిన స్వేచ్ఛ
స్వేచ్ఛ వేరు
విశృంఖలత వేరు
ఇప్పుడు మీరు ఉంటే వీళ్ల కోసవా నేను బాధ పడ్డాను అని మీరే బాధ పడతారు
ప్రతిదానికి ఓ హద్దు ఉంటుంది ఆఖరికి మంచికైనా సరే
అమ్మా ఆడవాళ్ళూ మీరు మొగాడితో సమంగా బారుకి వెళ్లి తాగకండి
మీరు తాగాలనుకుంటే మీ డబ్బు మీ శరీరం మీ ఇష్టం
ఇంటికి తెచ్చుకొని తాగండి. మీకు మంచిది ఇతరులకి మంచిది
మీతో కలిసి తాగిన వాడు మీ వెనక యెంత నీచంగా మాట్లాడుతాడో మీకు తెలుసా
యెవడేవనుకుంటే నాకేఁవిటి కేరే జాట్ అంటారా ఓకే
కొన్ని పల్లెటూళ్లలో ఆడవాళ్లు అక్కడ కల్లు దుకాణం లేకుండా చేసేరు
మరి మీరు చదువుకున్నారు కొంచెం అయినా సంస్కారం లేదా
స్వేచ్ఛకి ఓ లక్ష్మణ గీత ఉంటుంది
ఆ గీత మనవే గీసుకోవాలి
బహుశా మీకు డబ్బు ఎక్కువ ఉండొచ్చు
కానీ ఇది పధ్ధతి కాదు
వ్యవస్థ మారాలి అంటాం
ముందు మనం మారాలి
ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు
మరి ఆ దీపం కొరివి కాకూడదు
భారత మాత వెక్కి వెక్కి ఏడుస్తోంది వీళ్లా నా పిల్లలు అని
కలకంఠి కంట కన్నీరు ఒలికిన సిరి ఇంట నొల్లదు అంటారు
మరి భారతమాత కలకంఠి కదా
ఆవిడ కంట నీరు రానివ్వకండి
ప్లీజ్
బీనా దేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ