NewsOrbit
Featured రాజ‌కీయాలు

తెలంగాణాలో ఈ రాజకీయం మిస్సవ్వద్దు…!

తెలంగాణాలో కరోనా విఆలయతాండవం చేస్తుంది…! సముద్రం నుండి సునామి వచ్చినట్టుగా రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. టెస్టులు చుస్తే చాల తక్కువగా జరుగుతున్నాయి. ఏ రాష్ట్రంలోనూ లేనంతగా అక్కడ 25 శాతం పైగా పాజిటివ్ రేటు నమోదవుతుంది…! కరోనాతో పాటూ అక్కడ రాజకీయమో పెరిగిపోయింది. కొత్త డిమాండ్లు, సరికొత్త ప్రతిపాదనలతో విమర్శల దాడి మొదలయ్యింది. కానీ సమాధానమే కరువయ్యింది…!

ఫాఫం కేసీఆర్. కరోనాతో కత్తి వీరుడిలా పోరాడతాడు అనుకుంటే కనీసం కట్టే పుల్ల వీరుడిలా కూడా పోరాడట్లేదు. కేసులు పెరుగుతున్న వేళ అక్కడ కేసీఆర్ కనిపించకపోవడం.., ఇటు తండ్రికి తగ్గ కొడుకుగా ఉన్న కేటీఆర్ కూడా కనిపించకపోవడం… మామపై మచ్చ పడనీయని హరీష్ రావు కూడా మాయమవ్వడం ప్రతిపక్షాలకు ఆయుధాలు దొరికాయి. మూకుమ్మడి దడి మొదలయ్యింది. అసలే ప్రత్యర్థి ఒక మాట అంటే పది మాటలు బదులిచ్చే కేసీఆర్ లేకపాయె.. ఇంకేముంది ఇన్నాళ్లు మాట్లాడని పొన్నాల లక్ష్మయ్య.., బండి సంజయ్.., లాంటి నాయకులు ఇప్పుడు పదునైన విమర్శలు చేస్తున్నారు. పొన్నాల అయితే ఏకంగా తెలంగాణాలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ డిమాండ్ పైకి తీసుకొచ్చారు.

 

రేవంత్ రెడ్డి అయితే ఇంకొన్ని అడుగులు ముందుకు వేసి… కేసీఆర్ కి కరోనా అని వార్తలు వస్తున్నాయి, అది బయటకు చెప్పాలని డిమాండ్ చేసారు. సీఎం ఆరోగ్య స్థితిని తెలియజేయాలని కోరారు. కేసీఆర్ ఒకవేళ పరిపాలన అందించలేని స్థితిలో ఉంటె కేటీఆర్ కో, హరీష్ కో పాలన అప్పగించాలని కొత్త డిమాండ్ తెచ్చారు. రాష్ట్రంలో కరోనాపై కనీసం సమీక్ష చేయకుండా.., పాలనను గాలికి వదిలేసినా సీఎం దేశంలో ఏ ఒక్కరూ లేరని గుర్తు చేస్తూ.., గవర్నర్ వెంటనే పట్టించుకోవాలని కోరారు.

మొదటిసారి ప్రతిపక్షాల విమర్శలకు అధికార టీఆరెస్ పక్షం నుండి సమాధానాలు రావడం లేదు. ఆ పార్టీలో ధాటిగా మాట్లాడే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు సమాధానం ఇచ్చేవారు కరవయ్యారు. అందుకే రెండు ప్రతిపక్షాలు అధికార పక్షంపై మూకుమ్మడి దాడి మొదలు పెట్టాయి. ఇంతటి బిజీ వేళలో.., తెలంగాణాకి రాష్ట్రపతి పాలన అనే అంశం మోడీ ఆలోచిస్తారు, అమలు చేస్తారు అనుకోవడం దున్నపోతుకు పాలు పిండినట్టే..!

author avatar
Srinivas Manem

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju