NewsOrbit
రాజ‌కీయాలు

విజయసాయిపై బుద్దా ఫైర్

అమరావతి: వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందిస్తూ ఆయనపై విమర్శల వర్షం కురిపించారు.

శకుని మామ విజయసాయిరెడ్డి మొహం కరవుకి కేరాఫ్ అడ్రస్‌లా ఉంటుందని బుద్దా విమర్శించారు. సింగిల్ టెండర్‌ల వెనుక ఉన్న రహస్యం ప్రజలకు తెలిసిపోయిందని విజయసాయిరెడ్డి పిచ్చిపట్టి మాట్లాడుతున్నాడని బుద్దా పేర్కొన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చి 120 రోజుల్లో  150మంది రైతుల ప్రాణాలు బలితీసుకున్నారని బుద్దా విమర్శించారు. ఎగువ రాష్ట్రాల నుండి వరద నీరు వచ్చినా రాయలసీమ రైతాంగానికి నీరు ఇవ్వలేని తుగ్లక్ పాలనకు డైరెక్టర్ అయిన విజయసాయిరెడ్డి కరువు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని  బుద్దా అన్నారు. చంద్రబాబు పాలనలో పది లక్షల పంట కుంటలు ఏర్పాటు చేశారని బుద్దా గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో రెండంకెల వృద్ధి సాధించిన ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ‌అని బుద్దా పేర్కొన్నారు. తమరు రాష్ట్రంలో పాదం మోపిన నాటి నుండి అకాల వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లిందని బుద్దా అన్నారు.

కూల్చడం, ముంచడం తప్ప తమరికి రైతుల బాధలు తెలిస్తే కదా అని బుద్దా ఎద్దేవా చేశారు. దొంగడబ్బుతో చెత్త పేపరు, చెత్త ఛానెల్ నడిపే తమరికి పత్రికా విలువలు, పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంటే ప్రాణాలు తీసే మొసలి అయ్యో పాపం అని కన్నీరు కార్చినట్లుందని బుద్దా వ్యాఖ్యానించారు. తమ దొంగ పేపరు పుట్టిన నాటి నుండి నేటి వరకూ ఒక్క వార్త అయినా పత్రికా విలువలతో రాసారా అని బుద్దా ప్రశ్నించారు.

తమరి పేపరు గురించి మాట్లాడకుండా సామ్నా, మురసోలి గురించి మాట్లాడుతున్నారంటే విజయసాయిరెడ్డికి పత్రికా విలువలు ఏంటో అర్థమయినట్లుందని బుద్దా వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డికి దమ్ముంటే ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడాలని బుద్దా సవాల్ విసిరారు. 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని చెప్పి మాటతప్పారని బుద్దా
విమర్శించారు. మద్యపాన నిషేదం అంటూనే మరో పక్క ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు తెరిచి ప్రజలను మోసం చేసినందుకు మహిళలు చెప్పులతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని విజయసాయిరెడ్డి అన్నారు.

వైసిపి కార్యకర్తలకు గ్రామవాలంటీర్‌లుగా పేరు పెట్టగానే వాళ్లు సేవకులయిపోరని బుద్దా అన్నారు. జగన్ పాలనలో కరెంటు కోతల వల్ల కొవ్వోత్తులు, లాంతర్లు, ఇన్వెర్టర్‌. జనరేటర్‌ల వ్యాపారం సూపర్‌గా సాగుతోందని బుద్దా అన్నారు. లాంతర్ల వ్యాపారం ఎమైనా మొదలు పెట్టారా అని బుద్దా వ్యంగ్యంగా ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి బొగ్గుత విద్యుత్, జల విద్యుత్ అంటూ సొల్లు కబుర్లు చెప్పకుండా కరెంటు ఎప్పుడొస్తుందో ప్రజలకు చెప్పాలని బుద్దా డిమాండ్ చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Leave a Comment