Premi Vishwanath: మలయాళ నటి ప్రేమీ విశ్వనాథ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తనకి సక్సెస్ ఇచ్చిన సీరియల్ తో ప్రేక్షకుల ముందు కి వచ్చింది. మలయాళం లో మరియు తమిళ్లో కొన్ని ప్రాజెక్ట్స్ చేసి.. తెలుగులో అడుగుపెట్టి స్టార్ మా లో ఊహించని రేంజ్ లో సక్సెస్ అయిన కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క మనందరికీ సుపరిచితమే. ఇక ఆ సీరియల్ ముగిసిన అనంతరం ప్రేమీ విశ్వనాధుని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో మిస్సయ్యారు. ఇక ఆలోటును తీర్చేందుకే తాజాగా కార్తీకదీపం సీరియల్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది ప్రేమీ విశ్వనాథ్. ప్రస్తుతం కార్తీకదీపం సీక్వెల్ తో పాటుగా మలయాళం లో పలు ప్రాజెక్టులు చేస్తుంది.
అదేవిధంగా ఈమె బిజినెస్ కూడా తాజాగా స్టార్ట్ చేసింది. నిన్న తమిళనాడు కేరళలో.. సంవత్సరాది అయిన విఘ పండగని ఫ్యామిలీతో కలిసి ఎంతో అంగరంగ వైభోగంగా సెలబ్రేట్ చేసుకుంది ప్రేమీ విశ్వనాథ్. భర్త మరియు కొడుకుతో ఉన్న కొన్ని ఫోటోలను సైతం షేర్ చేసింది. అదేవిధంగా కొడుకుతో కలిసి.. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆశీస్సులు అందుకుని శ్రీహాల హస్తి టెంపుల్స్ ని కూడా విజిట్ చేసింది ప్రేమీ విశ్వనాథ్. ఇక ప్రేమీ విశ్వనాథ్ కొడుకుని చూసి.. రీసెంట్ గానే ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంత పెద్ద కొడుకు ప్రేమి విశ్వనాథ్ కి ఉన్నాడా.. ఇంతకాలం తెలియకుండా భానే మేనేజ్ చేసింది గా.. అయినా ఈమె అందానికి అంత పెద్ద కొడుకు ఉన్నాడు అంటే అసలు నమ్మశక్యం కావడం లేదు.
ప్రస్తుత కాలంలో చిన్న వయసులో నే ముసలి వారిలాగా కనిపిస్తున్న వారు ఎందరో ఉన్నారు. కానీ అంత పెద్ద కొడుకు పుట్టిన మీరు ఇంకా ఇంతయంగా ఉన్నారంటే మీది మామూలు టాలెంట్ కాదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. ఇక ప్రేమే విశ్వనాధ్ అవకాశాలు దొరికితే సినిమాల్లోకి కూడా వెళదామని గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. కానీ పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు. బుల్లితెరపై అంటే ఈజీగా అవకాశాలు దక్కుతాయి. కానీ వెండితెరపై అవకాశాలు దక్కాలంటే చాలా కృషి చేయాలి. ఎందుకంటే పూర్వకాలంలో సినిమా ఇండస్ట్రీకి ఎవరైనా వచ్చారు అంటే వారు ని సమాజం ఏదోలాగా చూసేది. కానీ ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో స్థిరపడితే వారిని గొప్పవారు లాగా చూస్తున్నారు.
అందువల్లే కోట్లాదిమంది జనం స్టూడియో ముందు పాడుకాపులు కాస్తున్నారు. ఇక ఈ తరుణంలోనే ఒక్కొక్కరుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో హీరో మరియు హీరోయిన్ల సినీ కెరీర్ లైఫ్ చాలా తగ్గిపోయింది. ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ కాలంలో 150 సినిమాలు దాకా చేసేవారు ఒక్కో హీరో. కానీ నేటి కాలంలో మాత్రం ఒక హీరో పది సినిమాలు చేస్తే దానిని ఒక రికార్డు లాగా భామేస్తున్నారు. అలా తయారయింది మరి మన సినీ ఇండస్ట్రీ. అందువల్లే హీరోయిన్స్ కావాలంటే చాలా కృషి చేయాల్సి వస్తుంది. అలా ప్రేమి విశ్వనాథ్ కూడా తన సాయి శక్తుల ప్రయత్నిస్తే తప్పనిసరిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టవచ్చు.