బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ 1449 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈ రోజు సెప్టెంబర్ 5 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే దీప దేవుడితో అప్పుడు బతకడం కోసం వంటలు చేశాను, ఇప్పుడు నా ప్రేమను, నా భర్తను దక్కించుకోవడం కోసం వంటలు చేయాల్సి వస్తుంది అని అనుకుంటుంది.అదే సమయంలో దీపకు డాక్టర్ వాళ్ళ అమ్మగారు మోనితను ఉద్దేశించి కార్తీక్ తో పిల్లల్ని కనడానికి ప్రయత్నం చేస్తుందేమో అన్న మాటలు గుర్తొచ్చి బాధ పడుతుంది. ఆ మోనిత మనసులో ఇలాంటి ఆలోచనలు ఉన్నా ఉండొచ్చు దాన్ని ఎలాగైనా జరగకుండా ఆపాలి అని అనుకుంటుంది దీప.
మోనిత మరొక ప్లాన్ :
సీన్ కట్ చేస్తే మోనిత… కార్తీక్ దగ్గరకు వెళ్లి అలా కాసేపు బయటికి వెళ్ళొచ్చు కదా అని అంటుంది. దానికి కార్తీక్ ఇది నువ్వేనా ఎప్పుడూ ఇంట్లో ఉండు అనే నువ్వు ఒకేసారి నాకు స్వేచ్ఛను ఇస్తే నాకు నువ్వేనా అనే అనుమానం వస్తుంది అని అంటాడు కార్తీక్. అప్పుడు సరే కానీ కార్తీక్ నేను నీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పి మనం బొంబాయి బయలుదేరుతున్నాము అని అంటుంది. ఆ మాటకు కార్తీక్ షాక్ అయ్యి బొంబాయా…ఎందుకు అని ఆశ్చర్యంగా అడగుతాడు. అవును కార్తీక్ మన ఇంట్లో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు అని అంటుంది మోనిత.కానీ కార్తీక్ మాత్రం మరి నాకు తెలుగు ఎందుకు ఇంత బాగా వచ్చు అని అడుగుతాడు.
కార్తీక్ ను బొంబాయి తీసుకుపోతున్న మోనిత :
అప్పుడు మొనిత మీ తాత నాన్నలు తెలుగులో కూడా పండితులే తెలుగు వాళ్ళమే కాని అక్కడ సెటిల్ అయ్యాము అని అంటుంది మోనిత. సర్లే కాని నాకు ఆకలేస్తుంది అని అంటాడు కార్తీక్. ఈ రెండు రోజులు బయట ఉన్న వంటలక్క దగ్గర నుండి తెప్పించుకుందాము అని మోనిత అంటుంది.సరే అంటాడు కార్తీక్..అప్పుడు మోనిత దీప దగ్గరికి వెళ్లి బయట ఉన్న కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని ఏం దీప..కార్తీక్ నుంచి నన్ను దూరం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు ఉన్నావు కదా అంటుంది. నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా నేను ఏమీ భయపడను అని అంటుంది మోనిత.దానికి దీప నువ్వు ఏం భయపడనట్లు అయితే నిన్న నువ్వు ఎందుకు అంత వణికావు అంటుంది..ఎక్కడ డాక్టర్ బాబుకి నా బిర్యాని తిని గతం గుర్తొస్తుందా అని నువ్వు బయపడ్డావు చూడు అప్పుడే నే గెలిచాను.. నా గెలుపు మీద నాకు ఎలాంటి సందేహము లేదు అని అంటుంది దీప.
కార్తీక్ ఇంటికి టిఫిన్ తెచ్చిన దీప :
ఇక మోనిత మనసులో, రేపే ముంబై వెళ్ళిపోతున్నావు కదా అప్పటివరకు నువ్వేం చేయగలవు అని అనుకోని సర్లే కార్తీక్ కి నీవంటలే కావాలట తెమ్మన్నాడు అని చెప్పి ఉప్మా మాత్రం చేయొద్దు అని అంటుంది మోనిత. ఉప్మా ఎందుకు చేయకూడదు నేను అదే చేస్తా అని చెప్తుంది దీప.మళ్ళీ సీన్ వారణాసి సౌర్య దగ్గర ఓపెన్ అవుతుంది. ఇద్దరు ఆటోలో వెళుతు అమ్మా నాన్నల గురించి వెతుకుతూ ఉంటారు.ఇక దీప టిఫిన్ తీసుకుని కార్తీక్ వాళ్ళ ఇంటికి వస్తుంది.అప్పుడు కార్తీక్ వంటలక్క అని చెప్పి చూశావా నాకు నీ పేరు బానే గుర్తుంది అని అంటాడు.మళ్ళీ దీప మా అత్తయ్య కోడలా అంటుంది..హిమా వంటలక్క అని పిలుస్తుంది మీరు దీప అని పిలవండి చాలు అని అనగా మోనిత ఒక్కసారిగా హే ఆపు అని అరుస్తుంది. కార్తీక్ ఏమైంది అలా అరిచావ్ అంటే మాటల్లో పడి పచ్చడి ఎక్కువ వేస్తుందేమో అని అలా అరిచాను అంటుంది అదేదో చిన్నగా చెప్పొచ్చుగా అని అనడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది