మోదీ ఒక్కసారైనా పోలవరం వచ్చారా?

Share

(న్యూస్ ఆర్బిట్ బ్యారో)

పోలవరం ప్రాజెక్టును చూసేందుకు ప్రధాని మోదీ ఒక్కసారైనా రాలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. పోలవరం స్పిల్‌వేలో క్రస్ట్‌ గేట్లను అమర్చే ప్రక్రియను పూజ చేసి ఆయన సోమవారం ప్రారంభించారు. ఆ తర్వాత ప్రాజెక్టు వద్దనే ఏర్పాటు చేసిన రైతు సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. ఏపీలో అభివృద్ధిని తెలంగాణ కేసీఆర్ అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒడిశా సీఎంతో కలిసి పోలవరం నిర్మాణానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టు వద్ద రైతు సభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు :

 • వచ్చే మే నెలలో ఈ ప్రాజెక్టు ముఖ్యమైన పనులు పూర్తిచేసి రెండు కాలువల ద్వారా ఒక కాలవ విశాఖపట్నం వైపు మరో కాలవ కృష్ణ జిల్లా నది వైపు ఈ రెండు కాలవ లతో గ్రావిటీ తో నీళ్లు ఇవ్వ గలుగుతాం.
 • నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు రైతుల ఆదాయాన్ని రెండు ఇంతలు చేస్తాం అంటున్నారు. రెండింతలు చేయలేదు కదా వారి జీవితం అగమ్యగోచరంగా మారింది అప్పుల ఊబిలో కుక్కుకున్నారు. గిట్టుబాటు ధర రాలేని పరిస్థితి.
 • నేను ఇదంతా ఆలోచించి వ్యవసాయంపై శ్రద్ధ పెట్టాను. రూ. 24 వేల కోట్ల రూపాయలతో ఒక్కొక్క రైతుకి లక్షా 50 వేల రూపాయలు రుణ విముక్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో రైతులకు లక్ష రూపాయలే రుణ మాఫీ చేశారు.
 • రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతుల బాసటగా ఉండాలని రూ 1.50 లక్షలు రుణ మాఫీ చేసా.
 • నాలుగు సంవత్సరాల్లో రైతుల ఆదాయం రెట్టింపు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే. నీళ్లు ఇవ్వడం వల్లే అనంతపురం జిల్లాకు కియా మోటర్స్ వచ్చింది.
 • మెట్ట ప్రాంతంలో దృష్టి సారించాను. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే నదుల అనుసంధానం.
 • రెండు కోట్ల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని అనేది జీవిత ఆశయం భవిష్యత్తులో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా తయారవుతుంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దేశంలోనే అత్యంత పర్యాటక కేంద్రంగా మారబోతుంది.
 • మన రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా ఏర్పడింది జూన్ 2 తారీఖున. అప్పుడే  ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఇబ్బంది పెడుతుందని భావించి  7 మండలాలు ఆంధ్రాలో కలిపితే గాని ప్రాజెక్టు పూర్తి అవ్వదు ఆనాడే చెప్పాను. 7 మండలాలు ఇవ్వకపోతే ప్రమాణ స్వీకారం చేయను అన్నాను. నాకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదుఅని స్పష్టంగా చెప్పాను. దాని తర్వాత పోలవరం ప్రాజెక్టు కి శ్రీకారం చుట్టాను.
 • పోలవరం ప్రాజెక్ట్ ని ఉన్న ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్టుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ పవర్ పోలవరం ప్రాజెక్టు బెస్ట్ ఇంప్లిమెంటేషన్ వాటర్ రిసోర్స్ ప్రాజెక్టుగా 2019 గా గుర్తించారు. జనవరి 4వ తారీఖున ఒక అవార్డు కూడా ఇస్తున్నారు.
 • 83 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్ చేశాను. వారం వారం ఇక్కడికి వచ్చి సోమవారం పోలవరంగా మార్చుకున్నాను 29 సార్లు ఇక్కడికి వచ్చాను.
 • 16 వేల 360 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేశారు. ఇది ప్రపంచ రికార్డు అని చెప్పుకోవచ్చు.
 • జనవరి 6 తారీఖున ప్రారంభించి 7వ తారీకు వరకు 24 గంటల్లో ఒక గిన్నిస్ బుక్ రికార్డ్స్ సృష్టించబోతున్నారు. ఒకే రోజున 28 వేల నుంచి 30 వేల క్యూబిక్ మీటర్ పనులు చేసి ప్రపంచంలో చరిత్రకి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ రికార్డు సృష్టించబోతున్న నవయుగ కంపెనీ వారిని అభినందించాలి.

పోలవరం స్పిల్‌వేలో క్రస్ట్ గేట్ల ఏర్పాటు ప్రక్రియ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

 


Share

Related posts

‘రాజధాని రైతులకూ న్యాయం చేస్తాం’

somaraju sharma

నిర్భయ దోషిపై జైల్లో అత్యాచారం!

Mahesh

జగన్ నిర్ణయాలే బిజెపికి బలం!

Siva Prasad

Leave a Comment