(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రూపాయికే ఇడ్లీలు అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తున్న ఇడ్లీ బామ్మ కమలతాల్ కు వంట గ్యాస్ కనెక్షన్ లభించింది. ఇన్నాళ్లు కట్టెల పొయ్యి మీద ఇడ్లీలు చేసిన బామ్మ.. ఇకపై వంట గ్యాస్ ద్వారా ఇడ్లీలు చేయనుంది. తమిళనాడులోని వడివేలపాళ్యం అనే గ్రామానికి చెందిన 80 ఏళ్ల కమలతాల్ బామ్మ గత 30 ఏళ్లుగా రూపాయికే ఇడ్లీ అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తోంది. రోజుకు వెయ్యి ఇడ్లీలు అమ్ముతుంది. ఈ ఇడ్లీ బామ్మ గురించి ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా బామ్మ గురించి తెలుసుకున్నారు. ఆమెకి ఆర్థికసాయం చేస్తానని ట్విట్టర్ లో ప్రకటించారు. ‘కమలతాల్ ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదే వంట చేస్తున్నారు. ఆమె గురించి ఎవరికైనా తెలిస్తే.. నాకు చెప్పండి. ఆమె వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు, ఆమెకు వంటగ్యాస్ స్టౌవ్ కొనిచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేసిన మరుసటి రోజే భారత్ గ్యాస్ కోయంబత్తూర్ విభాగం స్పందించింది. కమలతాల్ కు వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది. బామ్మ ఇంటికి వెళ్లి కొత్త గ్యాస్ స్టౌవ్, సిలిండర్ ఇచ్చారు.
This is superb. Thank you Bharat Gas Coimbatore for giving this gift of health to Kamalathal.
As I have already stated, I am happy to support her continuing costs of using LPG…And thank you @dpradhanbjp for your concern and thoughtfulness https://t.co/tpHEDxA0R3— anand mahindra (@anandmahindra) September 11, 2019
ఈ విషయం తెలిసి ఆనంద్ మహీంద్రా సంతోషం వ్యక్తం చేశారు.”ఇది అద్భుతం. కమలాతాల్ కు ఆరోగ్యకరమైన కానుక ఇచ్చినందుకు భారత్ గ్యాస్ కోయంబత్తూర్ విభాగానికి కృతజ్ఞతలు. ఆమెకు ఆర్థికంగా అండగా ఉంటానని ఇదివరకే చెప్పాను.. ఇక మీదట ఆమె వంటగ్యాస్ కు అయ్యే ఖర్చును నేను భరిస్తాను” అని మహీంద్రా మరో ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా కారణంగానే బామ్మకి వంట గ్యాస్ కనెక్షన్ వచ్చిందని, ఈ విషయం తమకు సంతోషం కలిగించిందని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.
Thankyou Sir, for highlighting the issue.
Kamalathal has been using #HPGas domestic connection.
She was approached today & provided with a commercial installation with proper Burner & Piping suitable for bulk cooking, which will help her expand business.https://t.co/tN8FqWPIDi— Hindustan Petroleum Corporation Limited (@HPCL) September 11, 2019
మరోవైపు హెచ్పీ గ్యాస్ కూడా ఈ బామ్మకు సాయం అందించింది. ఆనంద్ మహీంద్రా ట్వీట్ కి స్పందించిన హెచ్పీ గ్యాస్ ప్రతినిధులు తమ సాయాన్ని బామ్మకు అందజేశారు. గ్యాస్ కనెక్షన్ తో పాటు హాటల్స్ లో ఉపయోగించే పెద్ద బర్నర్ ను అందజేశారు. ఈ విషయాన్ని మహీంద్రాకు ట్యాగ్ చేస్తూ హెచ్పీ గ్యాస్ ట్వీట్ చేసింది.