ఇండియా నుంచి హజ్ యాత్రకు వెళుతున్న ముస్లింలు ఎయిర్ ఇండియా విమానాన్ని ఎంత చెత్తచెత్తగా తయారు చేశారో చూడండి. విమానం సిబ్బందికి సానుభూతి చూపడం తప్ప ఏం చేయగలం అంటూ ఒక వీడియోను ఇంటర్నెట్లో పెద్ద ఎత్తున చలామణీ చేస్తున్నారు.
https://www.facebook.com/lekhraj.jadli/videos/10217830433485853/
ఫేస్బుక్లో ఈ వీడియో భారీగా వైరల్ అవుతోంది.
ట్విట్టర్లో కూడా హిందీ శీర్షికతో దీనిని తిప్పుతున్నారు. స్వచ్ఛ్ భారత్.. ఎయిర్ ఇండియా విమానంలో హజ్ యాత్రికులు.. స్వచ్ఛ్ భారత్ నిరక్షరాస్యత పరిమితి దాటిపోయింది. నరేంద్ర మోదీ వారి కోసం ఇతర ఏర్పాట్లు చేయాలి. వారు మనలాంటి మనుషులతో కలిసి ప్రయాణం చేసేందుకు అర్హులు కారు అని హిందీలో రాసి ఉంటుంది.
https://twitter.com/thedeepikadas/status/1148813250756112384
ఈ వీడియో వాట్సాప్‌లో కూడా వైరల్ అవుతోంది.
గత ఏడాది కూడా ఇదే వీడియో ఇదే రాతలతో చలామణీ అయింది. దీపికా షెట్టి అనే వ్యక్తి ఫేస్బుక్ అకౌంట్ నుంచి వచ్చిన ఈ వీడియోను 1.3 లక్షల మంది చూశారు. ట్విట్టర్లో కూడా ఇలాగే తిరిగింది.
https://www.facebook.com/100010482588655/videos/694608400898573/
ఫ్లెయిట్ డర్టీ క్యాబిన్ అనే పదాలతో ఆల్ట్‌న్యూస్ ఈ వీడియో కోసం గూగుల్‌లో వెదికింది. అప్పుడు మిర్రర్ వెబ్సైట్లో ఉన్న 2016 నాటి ఒక పోస్టు కనబడింది. సౌదీ అరేబియాలో ఇటీవల ఒక విమానంలో ప్రయాణికులు మిగిల్చిన చెత్త ఇది అంటూ మిర్రర్ దానిని పోస్టు చేసింది.
దాని ఆధారంగా మరింత వెదికినపుడు ద సన్, డైలీ మెయిల్, అరబ్ న్యూస్ వంటి వెబ్సైట్లు కూడా మిర్రర్ లాగే రిపోర్టు చేసినట్లు తెలిసింది.
జెడ్డా నుంచి ఇథియోపియా వెళ్లే విమానం ఇది అంటూ అరబ్ న్యూస్ రిపోర్టు చేసింది. ఆ విమానంలో ఉన్న ప్రయాణీకుల్లో ఎక్కువ మంది సౌదీ నుంచి ప్రభుత్వం బయటకు పంపిస్తున్న వలసదారులేనని ఒక అధికారి చెప్పినట్లు అరబ్ న్యూస్ తెలిపింది.
గతంలో ఈ వీడియో నిజానిజాలను ఎఎఫ్‌పి వార్తాసంస్థ కూడా పరిశోధించింది. హాజ్ యాత్రికుల అపరిశుభ్రత అంటూ ఈ సౌదీ విమానం వీడియో అప్పుడప్పుడూ బయటకు వస్తోంది.
ఆల్ట్ న్యూస్ సౌజన్యంతో