ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బిజిబిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొద్ది సేపు హెలికాఫ్టర్ మెకానిక్ అవతారం ఎత్తాడు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనాలో శుక్రవారం ఎన్నికల ప్రచారం ముగించుకొని తిరిగి వెళుతుండగా రాహుల్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌కు సాంకేతిక సమస్య ఎర్పడింది. దీంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది, హెలికాఫ్టర్ సిబ్బంది దాన్ని సరిచేసే ప్రయత్నం చేశారు. రాహుల్ సైతం వారికి సహాయం చేశారు. కొద్దిసేపు ఆయనే స్వయంగా మెకానిక్ అవతారం ఎత్తి నేలపై పడుకొని పాన పట్టుకొని హెలికాఫ్టర్ తలుపుల స్క్రూలు బిగించారు.
దీనికి సంబంధించిన ఫోటో రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. ఈ ఫోటోకు నెటిజన్ల నుండి అనూహత్య స్పందన లభిస్తుంది. దాదాపు 96వేల మంది ఈ ఫోటోను లైక్ చేశారు.
అందరం కలిసికట్టుగా పని చేసి మరమ్మతు చేశామనీ, ప్రమాదమేమీ లేదని రాహుల్ పేర్కొంటూ టీమ్ వర్క్ అంటే అందరూ కలిసికట్టుగా శ్రమించడమేననీ, సమిష్టిగా కష్టపడటంతో సమస్యను త్వరగా పరిష్కరించగలిగాయమని రాహుల్ పేర్కొన్నారు.
https://www.instagram.com/p/BxSUJokgoQl/?utm_source=ig_web_copy_link