`ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ` అవార్డుతో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐ.ఎఫ్.ఎఫ్.ఐ) 2019లో సత్కరించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. “కొన్ని దశాబ్దాలుగా రజనీకాంత్ తన నటనతో ఇండియన్ సినిమా రంగానికి చేస్తున్న సేవలకు ఈ అవార్డును బహుకరిస్తున్నామని చెప్పడం ఆనందంగా ఉంది“ అంటూ ప్రకాష్ జవదేకర్ ట్వీట్ ద్వారా తెలిపారు. గోవాలో నవంబర్ 20 నుండి 28 వరకు జరగబోయే గోల్డెజ్ జూబ్లీ ఆప్ ఐ.ఎఫ్.ఎఫ్.ఐ అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఇందులో వివిధ దేశాలకు చెందిన 250 చిత్రాలను ప్రదర్శించనున్నారు. రష్యా భాగస్వామ్యంతో మన దేశం ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.