ముంబై: అప్పులతో సతమతమవుతున్న అనిల్ అంబానీ తన రిలయెన్స్ కంపెనీ హెడ్‌క్వార్టర్స్ భవనాన్ని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. శాంతాక్రజ్ సబర్బ్‌లోని ఈ భవనం విస్తీర్ణం ఏడు లక్షల చదరపు అడుగులు ఉంటుంది. ఇందులో 425 కార్ల పార్కింగ్‌కు చోటు ఉంది.
రిలయెన్స్ గ్రూప్‌లో ప్రధానమైన రిలయెన్స్ ఇన్ఫ్రా కంపెనీకి ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు ఉన్నాయి. అద్దె ద్వారా వచ్చే ఆదాయంతో అప్పుల బాధ తగ్గించుకుంటామని రిలయెన్స్ ఇన్ప్రా ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ జోన్స్ లాంగ్ లాసాల్లీకి ఈ భవనాన్ని అద్దెకు ఇచ్చే బాధ్యత అప్పగించారు.
రిలయెన్స్ ఇన్ఫ్రాతో పాటు మూతబడీన రిలయెన్స్ కమ్యనికేషన్స్ విభాగం ఆర్‌కామ్‌కు ఇప్పటికి ఎన్‌సిఎల్‌టి నుంచి 57,500 కోట్ల రూపాయల మేరకు క్లెయిములు వచ్చాయి. శాంతాక్రజ్ భవనం నుంచి నగరంలోని ఇతర ఆఫీసులకు మారనున్నట్లు రిలయన్స్ తెలిపింది.