వాళ్లను పంపినట్లు ఒప్పుకొన్న అమెరికన్ నటి
40 ఏళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం
న్యూయార్క్: తన అభిమానుల లోంచి అమ్మాయిలను తీసుకుని, వారిని సెక్స్ బానిసలుగా చేసినట్లు అమెరికన్ నటి అల్లిసన్ మాక్ కోర్టులో అంగీకరించింది. వారి శరీరాలపై తమ నాయకుడి పేరును పచ్చబొట్టుగా వేయించి, వారిని అతడివద్దకు శృంగారం కోసం పంపేదాన్నని ఒప్పుకొంది. మహిళలను ఎన్ క్స్విమ్ అనే రాకెట్ లోకి దింపుతోందన్న సమాచారం తెలియడంతో పోలీసులు మాక్ (36)ను ఏడాది క్రితం సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలపై అరెస్టు చేశారు. 58 ఏళ్ల తమ నాయకుడు కీత్ రానైర్ తో వారిని బలవంతంపు శృంగారానికి ఆమె పంపేది.
‘స్మాల్ విల్లె’ అనే సూపర్ హీరో టెలివిజన్ సిరీస్ లో క్లార్క్ కెంట్ స్నేహితురాలి పాత్రలో మాక్ బాగా ప్రాచుర్యం పొందింది. దాంతో ఆమెకు అభిమానులు కూడా ఎక్కువయ్యారు. వారిలో అడవాళ్లను ఎంచుకుని, ఈ పని చేయించింది. ఈ కేసులో ఆమెతో పాటు మరో ఐదుగురు నిందితులు కూడా ఉన్నారు. వీళ్లు ఏర్పాటుచేసిన ఎన్ క్స్విమ్ అనే రాకెట్ న్యూయార్క్ సమీపంలోని అల్బనీ వద్ద ఉంది. నేరం చేసినట్లు, అందుకు కుట్ర పన్నినట్లు ఆమె స్వయంగా అంగీకరించడంతో ఆమెకు 40 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.
సెక్స్ బానిసలుగా వారు అంగీకరించడానికి ముందే అమ్మాయిలు తమ నగ్న ఫొటోలు, ఇతర వ్యక్తిగత రహస్యాలకు సంబంధించిన ఫొటోలను ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ గ్రూపు నుంచి వాళ్లు వెళ్లిపోతామంటే ఆ ఫొటోలను బయటపెడతామని వీళ్లు బెదిరించేవారు. వాళ్ల శరీరాల మీద రానియెర్ పేరును పచ్చబొట్టు వేయించుకుంటుంటే మిగిలినవాళ్లు వారిని ఫొటోలు, వీడియోలు తీస్తారు. ఇంతకుముందు కెనడాకు చెందిన లిక్కర్ సామ్రాజ్యం సీగ్రామ్ వారసురాలు క్లేర్ బ్రోన్ప్ మన్ కూడా ఇలాంటి కేసులోనే పట్టుబడింది. ఆమె, ఆమె సోదరి కలిసి అమ్మాయిలకు 10 కోట్ల డాలర్ల వరకు ఇచ్చినట్లు ఆరోపణలొచ్చాయి.