సిమ్లా: మంచుతో నిండిన ప్రకృతి అందాలును చూసేందుకు వచ్చిన పర్యాటకులు ఒక్కసారిగా పరుగులు తీశారు. హిమపాతం కారణంగా మంచు చరియలు విరిిగిపడి రోడ్డుపై భారీ స్థాయిలో మంచు కదులుతుంటే కొందరు పర్యాటకులు దాన్ని వీడియో తీశారు. కదులుతున్న మంచు చరియను తమ కెమెరాల్లో వీడియో తీస్తూ వెనక్కి పరిగెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Ever seen the force of a moving glacier in real-time? This is in Tinku nallah near Pooh on NH-5, Kinnaur, HP.. #ClimateChange is not a distant reality. pic.twitter.com/J7ifxaAh1g
— Naveed Trumboo IRS (@NaveedIRS) January 13, 2020
హిమాచల్ ప్రదేశ్లోని టింకు నల్లా ప్రాంతంలో అందాలను తిలకించేందుకు కొందరు పర్యాటకులు వెళ్లారు. అయితే వారు రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంచు చరియలు రోడ్డుపై పడ్డాయి. వాటిని చూసేందుకు వాహనాల నుంచి కిందకు దిగారు. అయితే, పర్యాటకుల వైపు మంచు చరియ రావడం మొదలు పెట్టింది. దీంతో పర్యాటకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో చిత్రీకరించారు. అయితే మంచు వారిని వెంటాడుతున్నట్లుగా మరింత ముందుకు వచ్చింది. హిమం తమ వద్దకు రాగానే ‘వెనక్కి వెళ్లండి’ అంటూ అరుస్తూ పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఆర్ఎస్ అధికారి నవీద్ ట్రుంబూ పోస్ట్ చేశారు. ‘కళ్ల ముందు హిమనీనదం ముంచుకురావడం ఎప్పుడైనా చూశారా?’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://twitter.com/ragnvaldr902/status/1216658835492024320
This is not a glacier..this is part of an avalanche that is slipping on road because even road has an ice layer over it & as a result there is poor friction.
— Wanderer (@w_a_n_d_e_rer) January 13, 2020
They don’t carve such roads on an active glacier. This is probably an avalanche. Some people here are taking their lives at risk by clicking pictures up so close.?
— SelfIsolatingDoc (@periodontaldoc) January 13, 2020