(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఓ రైతు తీసుకువచ్చిన కూరగాయలను తన వాహనంతో తొక్కించిన ప్రభుత్వ అధికారి ఉదంతం ఉత్తర్ ప్రదేశ్లో చోటుచేసుకుంది. హపూర్ జిల్లాలోని ప్రభుత్వం నిర్వహించే మార్కెట్లో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అధికారుల అనుమతి లేకుండా రైతు తన కూరగాయలను అమ్ముకుంటున్నాడనే ఆక్రోశంతో ఓ ప్రభుత్వ అధికారి వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
This footage is from a @UPGovt sabzi mandi in #Hapur. A top official of the mandi went on a anti encroachment drive today. His driver seen in the footage using official vehicle to crush vegetables that a poor farmer was selling inside the mandi …. pic.twitter.com/OM8mnf0DgB
— Alok Pandey (@alok_pandey) November 16, 2019
ఓ రైతు అమ్మకానికి ఉంచిన కూరగాయలపై మార్కెట్ కార్యదర్శి సుశీల్ కుమార్ కి చెందిన ఎస్యూవీ వాహనంతో పలుమార్లు ముందుకు, వెనక్కి తీసుకోవడం మొబైల్ ఫోన్ వీడియోలో రికార్డయింది. దీంతో కూరగాయలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. తమ కూరగాయలనూ కూడా ధ్వంసం చేస్తారని భయపడిన మరికొంత మంది రైతులు వాటిని తొలగించడం ఆ వీడియోలో ఉంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇతర సిబ్బంది సహా ఏ ఒక్కరూ కూడా అతని చర్యలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ అధికారి తన డ్రైవర్ను మందలించి చేతులు దులుపుకున్నారు. రోడ్డుపై, దుకాణాల వద్ద కూర్చోవద్దని రైతులకు చాలా సార్లు హెచ్చరించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. షాపులు లేని వారు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామని కూడా చెప్పినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఓ ప్రభుత్వ అధికారి రైతు తీసుకువచ్చిన కూరగాయలను ధ్వంసం చేయడం సరైంది కాదని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడ్డారు. రైతు మార్కెట్కు తీసుకువచ్చిన కూరగాయలను వృధా చేశారని ఆ అధికారి తీరును ట్విటర్లో తీవ్రంగా ఖండించారు.
Official later said he had 'scolded' his driver. Eyewitness say he was around when this was being done and did not intervene !
— Alok Pandey (@alok_pandey) November 16, 2019
He should be suspended and arrested for endangering the lives and destroying property of the farmer.
— Chaitanya Shinde (@JoyousChaitu) November 16, 2019
He should compensate for the cost of the vegetables. It doesn't help the farmer by scolding the driver.
— Nandita Reddy (@NanditaReddy5) November 17, 2019