పెళ్లంటే నూరేళ్ళ పంట అన్నారు పెద్దలు.ఇల్లంతా సందడి, పచ్చటి తోరణాలు ,బంధువులు ,ఆభరణాలు , పట్టు చీరలు చిన్నారుల అల్లరితో పెళ్లి పందిరి అంత సందడే . ఇక కాబోయే వధూ ,వరుల సంగతి చెప్పక్కరలేదు . ఇది ఒక్కప్పటి మాట ఇప్పుడు కరోనా వచ్చాక ప్రపంచమే మారిపొయిన్ది . పెళ్లిళ్ల సంగతి వేరే చెప్పనవసరం లేదు . ఇప్పటికే పలు ముహుర్తాలు, ముగిసిపోగా,ఇక గురు,శుక్రమూఢాలు అధిక ఆశ్వయుజ మాసం, ఆషాడం ,భాద్రపదం తదితర కారణాలతో శుభకార్యలు చాలతక్కువ.ఈ వేసవి లో ఏప్రిల్, మే నెలల్లో నే చాలా వరకు ముహుర్తాలు, ఇప్పటికే ముగిసిపోయాయి
వర్షాకాలం కావడం తో శుభకార్యాలకు ఆశక్తి చూపించరు చాల మంది . ఆగష్టు 20 నుంచి సెప్టెంబర్ 17 వరకు బాధ్రపదం , శూన్యమాసం కావడంతో శుభకార్యాలు ఉండవు . ఆ తర్వాత అక్టోబర్ 16 వరకు నెల రోజులు అధిక ఆశ్వయుజ మాసం, శూన్య మాసం కావడం తో మంచి ముహూర్తాలకు అవకాశం లేకుండా పోయినది. అక్టోబర్ 21,28,29,30,నవంబర్ 6,11 నుంచి డిసెంబర్ 6 వరకు మంచి ముహుర్తాలు ఉన్న శుభకార్యాల కోసం పెద్దగా ఆశక్తి చూపించరు