NewsOrbit
వీడియోలు

సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగిన రీనా ద్వివేది

Share

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఉత్తర ప్రదేశ్‌లోని పిడబ్ల్యుడి శాఖలో అధికారిగా పని చేస్తున్న ఈ మహిళ ఒక్క ఫోటో కారణంగా సోషల్ మీడియాలో స్టార్‌గా ఎదిగిపోయింది. రీనా ద్వివేది లక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాగ్రామ్ పోలింగ్ బూత్‌లో పోలింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ఎన్నికల విధులకు వచ్చే సమయంలో లేత పసుపు రంగు చీరెలలో రెండు చేతులతో ఇవిఎం బాక్స్‌లు పట్టుకొని నల్లని కూలింగ్ కళ్లద్దాలు పెట్టుకొని నడుచుకుంటూ వెళుతుండగా ఆమె అందానికి ముగ్దుడైన ఒక ఫోటో జర్నలిస్ట్ ఆమె ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

అందంగా ఉన్న ఈ ఫోటో వైరల్ అవ్వడంతో టిక్‌టాక్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియాలో నెటిజన్‌లు ఆమె ఎవరో తెలుసుకునేందుకు సోధించారు. ఉత్తరప్రదేశ్‌లోని దేవరియాకు చెందిన మహిళగా గుర్తించారు. ఆమెకు చెందిన ఫేస్‌బుక్, టిక్‌టాక్ తదితర ఎకౌంట్‌ల నుండి  మరి కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా సేకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో వేలాది మంది నెటిజన్‌లు లైక్ ఇస్తూ కామెంట్‌లు పోస్టు చేశారు.

ఆమె విధులు నిర్వహించిన పోలింగ్ బూత్‌లో నూరు శాతం పోలింగ్ జరిగిందంటూ ప్రచారం జరిగింది. అయితే ఆమె ఈ విషయాన్ని కొట్టిపారేశారు,. కేవలం 70శాతం పోలింగ్ మాత్రమే జరిగిందని తెలియజేసింది.

టిక్ టిక్ సౌజన్యంతో…..

 


Share

Related posts

RGV ‘కాస్ట్ ఫీలింగ్ సాంగ్ ‘

anjaneyulu ram

టీజర్ బాగానే నవ్వించింది

Siva Prasad

` 2 అవ‌ర్స్ ల‌వ్‌` టీమ్ ఇంట‌ర్వ్యూ

Siva Prasad

Leave a Comment