(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మొట్టమొదటి సారి ఐస్‌క్రీం తిన్న ఓ చిన్నారిలో కనపడిన హావభావాలు అబ్బురపరుస్తున్నాయి. తొమ్మిది నెలల తమ పాపను తల్లిదండ్రులు ఐస్‌క్రీం పార్లర్‌కు తీసుకువెళ్లారు. కోన్ ఐస్క్రీంను కొని పాపకు తినిపిస్తుంటే.. తన రెండు చేతులతో ఐస్క్రీంను గట్టిగా పట్టుకుని ఇష్టంగా నాకింది. ఆ పాప చాలా ఇష్టంగా ఐస్క్రీంను తింటున్న సమయంలో ఆమె తల్లిదండ్రులు నవ్వు ఆపుకోలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను పాప తల్లి తన టిక్‌టాక్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాప హావభావాలు వెలకట్టలేనివిగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
https://youtu.be/Id2Nup1LZgw