(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
గుజరాత్ రాష్ట్రంలోని జునాఘడ్ పట్టణంలో జనావాసాల మధ్య సింహాలు హాల్ చల్ చేస్తున్నాయి. గిర్నార్ వణ్యప్రాణుల అభయారణ్యం ఈ పట్టణానికి సమీపంగా ఉండటంతో అడవిలోని సింహాలు పట్టణ వీధుల్లోకి చేరుకున్నాయి. గుంపులుగా సింహాలు రోడ్లపైకి రావడంతో వాహనదారులు భయంతో వణికిపోతున్నారు. కొందరు సెల్ ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయింది.
వీడియో ఎఎన్ఐ సౌజన్యంతో…..
#WATCH Viral video of a pride of lions seen roaming around a city road in Junagadh, which is near Girnar Wildlife Sanctuary. #Gujarat pic.twitter.com/QnpNQrb5yX
— ANI (@ANI) September 14, 2019