(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తినే వస్తువు అనుకుని ఒక మహిళ చేతిలోని సెల్ ఫోన్ను కొండముచ్చు లాక్కెళ్లింది. ఆ సెల్ ఫోన్ను ఏమి చేయాలో తెలియక అటు ఇటు తప్పి చూస్తూ తినేందుకు ప్రయత్నించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తెలంగాణ రాష్ట్రం జనగామలోని నెహ్రూ పార్క్ సమీపంలో నివాసం ఉంటున్న మహిళ ఫోన్ మాట్లాడుతుండగా ఎక్కడి నుండి వచ్చిందో గానీ ఓ కొండముచ్చు ఆమె చేతిలోని సెల్ ఫోన్ లాక్కున్నది. గోడపై కొద్దిసేపు కూర్చుని సెల్ ఫోన్ అటూ ఇటూ తిప్పుతూ దాన్ని ఇవ్వకుండా వింతగా ప్రవర్తించింది. ఆ సెల్ ఫోన్ కోసం కొండముచ్చు వెంట పడిన మహిళ అరటిపండు ఎర వేయడంతో సెల్ ఫోన్ వదిలేసి పండు తీసుకొని వెళ్లిపోయింది.