న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ సిక్రీలో ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా.. తాను వెళ్తున్న హెలికాప్టర్ పైలట్ కూడా ఓ మహిళే అని తెలుసుకుని చాలా ఉద్వేగానికి గురయ్యారు. పైలట్ తో సెల్ఫీ ఒకటి తీసుకుని వెంటనే ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘‘ఒక మహిళ నన్ను తీసుకెళ్లడం చాలా గర్వంగా ఉంది, అది కూడా హెలికాప్టర్ లో!” అని ఆమె దానికి కామెంట్ పెట్టారు.
So proud to be flown by a lady today, that too in a chopper! pic.twitter.com/PAkAuxAcgm
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 15, 2019
మహిళలకు సంబంధించిన అంశాలపై ప్రియాంకా గాంధీ తీవ్రంగా స్పందిస్తారు. ఈ జనవరిలో రాజకీయాల్లో చేరినప్పటినుంచి ఆమెపై కూడా కొంతమంది లైంగిక వేధింపులతో కూడిన వ్యాఖ్యలు చేశారు. మొట్టమొదటి రాజకీయ ప్రసంగంలోనే ఆమె సంప్రదాయాలను ఛేదించి ‘బెహనోం ఔర్ భాయియోం’ అన్నారు. (సాధారణంగా భాయియోం ఔర్ బెహనోం అని మొదలుపెడతారు). అసోంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సుష్మితా దేవ్ ఇదే విషయాన్ని గుర్తించి ట్విట్టర్ లో పెట్టగా, దానికి ప్రియాంక స్పందించి, ఎవరూ గుర్తుపట్టలేదనుకుంటా అని సమాధానమిచ్చారు.