NewsOrbit
న్యూస్

‘మోదికి సాష్టాంగపడీ ఫిర్యాదు చేసుకోండి’

అమరావతి: టిడిపి పిచ్చివాగుళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మాట్లాడాల్సిన అవసరం లేదని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న అమరావతిలో చంద్రబాబుపై దాడి జరిగిందని అసత్య ప్రచారం చేస్తున్నారు గానీ అక్కడేమీ జరలేదని అన్నారు. ఓ చెప్పు, రాయి పడ్డాయి అంతే దానికి జగన్ మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. పిచ్చి వాగుళ్లపై సమాధానం ఆశించకుండ చంద్రబాబును సరిచేసే విధానం ఏంటో దేవినేని ఉమామహేశ్వరరావు ఆలోచించుకోవాలని అంబటి వ్యంగ్యాస్త్రాన్నిసంధించారు. ‘కేంద్రానికి రిపోర్టు చేసుకోమనండి, ఎవరు వద్దన్నారు. మోది గారికి సాష్టాంగ నమస్కారం పెట్టి మరీ కోరమనండి’ అని అంబటి అన్నారు.
రాజధాని నిర్మాణంపై చంద్రబాబు బినామీలు తప్ప రైతులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో హాల్‌చల్ చేయడానికి ప్రయత్నం చేశారన్నారు. విషయం ఉన్నా లేకపోయినా ఏదో గందరగోళం, అలజడి సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తూనే ఉన్నారని అంబటి విమర్శించారు. ఈ అయిదు నెలల కాలంలో చంద్రబాబు చలో ఆత్మకూరు ఆందోళన, కోడెల శివప్రసాద్ ఆత్మహత్య వ్యవహారంపై ఆందోళన, ఆ తరువాత ఇసుక దీక్షలు ఇప్పుడు అమరావతి టూర్ ఇలా డ్రామాలు ఆడటమే సరిపోతుందని అన్నారు.

అమరావతి నిర్మాణాల్లో జరిగిన భారీ అవినీతి మొత్తం విచారణలో వెలుగులోకి వస్తాయని అంబటి చెప్పారు. అమరావతి ప్రాంతంలోని రైతాంగానికి చంద్రబాబు అన్యాయం చేయడం వల్లనే ఆయన కుమారుడు లోకేష్‌తో  పాటు రాజధాని ప్రాంతంలో టిడిపి అభ్యర్థులను ప్రజలు ఓడించారని అన్నారు. చంద్రబాబుకు రాజధానిపై అంత ప్రేమ ఉంటే ఇల్లు ఎందుకు కట్టుకోలేదని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబుకు ‘ముందుంది ముసళ్ల పండగ’ అంటూ వ్యాఖ్యానించారు. గతంలో ఇచ్చిన మొత్తం స్టేలను సుప్రీం కోర్టు ఎత్తివేసిందనీ, త్వరలో చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ జరుగుతుందనీ అంబటి చెప్పారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Leave a Comment