NewsOrbit
రాజ‌కీయాలు

‘కలం పోటుతో రాజధాని తరలింపు కుదరదు’

అమరావతి: రాజధాని అమరావతి ప్రాంత రైతుల ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకువెళతామని టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ హామీ ఇచ్చారు. మందడంలో నిరసన దీక్ష చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని రైతుల ఆందోళనను పార్లమెంటులో ప్రస్తావిస్తామని చెప్పారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ కోర్టుల్లో కేసులు వేస్తామని ఆయన తెలిపారు. అమరావతిలోనే రాజధాని ఉండేలా అన్ని విధాలుగా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.
అమరావతిని స్మశానం, ఏడారి అంటూ అర్ధం లేని విమర్శలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని తరలింపు అనేది ఉన్మాద చర్యగా కనకమేడల అభివర్ణించారు. సిఎంలు శాశ్వతం కాదనీ, అమరావతి రాజధానే శాశ్వతమనీ ఆయన అన్నారు.
అమరావతికి రక్షణగా ఎన్నో చట్టాలు ఉన్నాయని కనకమేడల స్పష్టం చేస్తూ  ఒక్క కలంపోటుతో రాజధానిని తరలిస్తామంటే కుదరదని అన్నారు. జిఎన్ రావు కమిటీకి చట్ట బద్దత లేదని ఆయన తెలిపారు.జగన్ ఎప్పుడూ కబ్జాదారుగానే ఉన్నారనీ అందుకే రైతుల బాధ అర్ధం కావడం లేదనీ కనకమేడల విమర్శించారు. రాజధానే కాదు, హైకోర్టు తరలింపును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాజధానిని, హైకోర్టును తరలిస్తే అమరావతిలో ఇంకేముంటుందని ఆయన ప్రశ్నించారు. విభజన సందర్భంలో జరిగిన నష్టం కంటే, గత ఆరు నెలల కాలంలో రాష్ట్రానికి జరిగిన నష్టమే ఎక్కువ అని కనకమేడల అన్నారు.

Related posts

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Leave a Comment