NewsOrbit
రాజ‌కీయాలు

‘ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు సిద్ధమా’

అమరావతి: విశాఖలో ఇన్‌సైడర్ ‌ట్రేడింగ్‌పై సిబిఐ విచారణ జరిపిస్తే జగన్ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో భూముల కొనుగోళ్లు, అమ్మకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

రాజధాని మార్పుపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. టిడిపి అయిదేళ్ల పాలన స్వర్ణయుగమనీ, వైసిపి ఏడు నెలల పాలన చెత్త పాలన అని దేవినేని ఉమా విమర్శించారు.

సాగునీటి ప్రాజెక్టులపై జగన్‌వి ఉత్తర కుమార ప్రగల్భాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే మాట ఏమో కానీ ఉన్న పరిశ్రమలే తరలిపోతున్నాయని ఉమా అన్నారు. టిడిపి హయాంలో నదుల అనుసంధానం ద్వారా 62 ప్రాజెక్టులు కార్యరూపంలోకి తీసుకువచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రి అసమర్థత, ముందు చూపు లేకపోవడం, అనుభవ రాహిత్యం వల్లే ఈ ఏడాది వరద నీరు సముద్రం పాలయ్యాయన్నారు.  పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేశారని ఉమా విమర్శించారు. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడ నిలిపివేశారని అన్నారు. టిడిపి ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి కాకూడదన్న కక్షతోనే పనులు నిలిపివేశారని ఉమా విమర్శించారు.

 

Related posts

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Leave a Comment