NewsOrbit
రాజ‌కీయాలు

‘రాజధానికి 1500 ఎకరాలు చాలు’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

విశాఖపట్నం: రాజధానికి 1500 ఎకరాలు సరిపోతుందని సిపిఎం నేత బివి రాఘవులు అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతిలోనే ఉండాలనీ, అయితే అది చంద్రబాబు చెప్పిన విధంగా అవసరం లేదనీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధ్యక్ష తరహా పాలన సాగే దేశాల్లో రాజధానులు వేరువేరు చోట్ల ఉండవచ్చనీ, పార్లమెంటరీ డెమోక్రసీలో అలా కుదరదనీ అన్నారు. అమరావతే రాజధాని అంటూ ముక్కలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ నేతలు ప్రయత్నిస్తున్నారని రాఘవులు తెలిపారు.

ఆర్థిక దుస్థితి, రాజకీయ అల్లకల్లోలాలకు వ్యతిరేకంగా జనవరి ఎనిమిదవ తేదీన సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

విశాఖలో సిఎం జగన్ పర్యటన ఉత్తరాంధ్ర ప్రజలను నిరాశకు గురి చేసిందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఉక్కు పరిశ్రమ భవిష్యత్తుతో ముడిపడి ఉందని రాఘవులు అన్నారు. దీనికి జగన్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో చెప్పాలన్నారు. నిజంగా జగన్ ఉత్తరాంధ్ర అభివృద్ధిని కోరుకుంటే రైల్వే జోన్, ఉక్కు పరిశ్రమ, సొంత గనులు, గిరిజన విశ్వ విద్యాలయాల కోసం ప్రయత్నం చేయాలని అన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా చతికిలపడ్డారని రాఘవులు వ్యాఖ్యానించారు. బిజెపితో దోబూచులాడారనీ బిజెపితో దగ్గర అవుతున్న వారితో తాము దూరంగా ఉంటామనీ రాఘవులు స్పష్టం చేశారు.

 

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Leave a Comment