(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అడవిలో పులిని చూస్తే ఏ జంతువైనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతుంది. కానీ, ఓ ఎలుగు మాత్రం తనపై దాడి చేసిన పులులకు అస్సలు బెదరలేదు సరికదా కన్నెర్రజేసి వాటినే రివర్స్‌లో బెదిరించింది. ఇదెక్కడి సైకో ఎలుగుబంటిరా నాయనా అనుకుని ఆ పులులు వచ్చినదారినే వెనక్కి పరుగులు పెట్టాయి. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌లోని రథంబోర్ నేషనల్ పార్కులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
This video captures an unexpected #clash between #Tiger & Sloth Bear in #Rajasthan’s @ranthamborepark. Just as the Tiger seems to dominate the unaware Sloth Bear, it springs at the Tiger and scares it off! #Wildlife is full of such wonders & surprises.@ParveenKaswan @WWFINDIA pic.twitter.com/bbyfP6uFuZ
— Parimal Nathwani (@mpparimal) January 21, 2020
ఈ వీడియోలో ఎలుగుబంటిని ఓ పులి చాలా దూరం వరకు వెంబడించింది. మధ్యలో మరో పులి ఎదురైంది. రెండు పులులు ఎలుగు బంటిని తినేద్దామనుకున్నాయి. ముందుగా ఒకటి ఎలుగుబంటి దగ్గరకు వచ్చింది. దానిమీదకు దాడి చేయాలని ప్రయత్నించింది. అయితే, ఎలుగు ఏమాత్రం భయపడలేదు. ధైర్యంగా రొమ్ము విడిచి దాని ముందు రెండుకాళ్ల మీద నిలబడింది. దీంతో ఆ రెండు పులులు ప్రాణభయంతో పరారయ్యాయి. అనంతరం ఎలుగు సైతం వెనక్కితిరిగి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. ఇది పాత వీడియోనే అయినప్పటికీ రాజ్యసభ ఎంపీ పరిమల్ నత్వానీ దీన్ని ట్విట్టర్లో షేర్ చెయ్యడంతో మళ్లీ వైరల్ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటికే కొన్ని వేల మంది వీక్షించారు. చాలా మంది దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ‘భలే ఉంది ఎలుగు ఖలేజా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ పులులు… పెద్దవి కాకపోవచ్చనీ, అందువల్లే అవి ఎలుగు బంటిని చూసి భయపడ్డాయని మరికొందరు కామెంట్లు చేశారు.
The tigers will “bear” this in mind the next time they hunt
— sandy (@Sandeeep_ma) January 21, 2020
https://twitter.com/Pushpar00274777/status/1219598435399032832