రాయలసీమలో ఇద్దరు పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన చంద్రబాబు

Share

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటి నుండే పార్లమెంట్ అభ్యర్ధుల ప్రకటన చేస్తున్నారు. ప్రస్తుతం రాయలసీమ పర్యటన చేస్తున్న చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలోనే ఇద్దరు లోక్‌సభ అభ్యర్ధులను ప్రకటించారు చంద్రబాబు. కడప, రాజంపేట పార్లమెంట్ అభ్యర్ధులను చంద్రబాబు ప్రకటించారు. కడప పార్లమెంట్ అభ్యర్ధిగా శ్రీనివాసరెడ్డి, రాజంపేట లోక్ సభ అభ్యర్ధిగా గంటా నరహరి పేర్లను చంద్రబాబు ప్రకటించారు. వీరు ఇద్దరు రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పిన చంద్రబాబు.. వీరు తమ నియోజకవర్గ పరిధిలో పర్యటించి నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇద్దరు అభ్యర్ధులకు అందరూ సహకరించాలని కోరారు.

 

శ్రీనివాసరెడ్డి ఇప్పటికే కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజంపేటకు చెందిన గంటా నరహరి బెంగళూరు కేంద్రంగా వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. గత వారమే గంటా నరహరి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. 2017 -18 లో రాష్ట్రపతి నుండి ఉత్తమ యువ పారిశ్రామికవేత్తగా అవార్డు అందుకున్నారు గంటా నరహరి. నరహరి రాజకీయాలకు కొత్తే కానీ ఆయన కుటుంబం చాలా కాలం నుండి రాజకీయాల్లో కొనసాగుతోంది. దివంగత ఎంపి ఆదికేశవులు నాయుడు సతీమణి సత్యప్రభ సోదరి అల్లుడు నరహరి. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన సత్యప్రభ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో మరణించారు. ఈ నేపథ్యంలో సత్యప్రభ స్థానంలో పోటీ చేసేందుకు నరహరిని టీడీపీ ఆహ్వానించింది. దీంతో ఆయన ఇటీవల టీడీపీలో చేరారు.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

10 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

18 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

1 hour ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago