NewsOrbit
Featured బిగ్ స్టోరీ

కుల “రాం”భజన…! విషం ఇలా ఎక్కిస్తున్నట్టా..?? పార్ట్ 2

కృష్ణా జిల్లాలో కుల రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్‎లో కుల కుంపట్లు అంతకంతకూ రాజుకుంటున్నాయ్. అది కూడా పాలిటిక్స్‎కు చిరునామాగా మారిన కృష్ణా జిల్లాలో కుల చిచ్చు కల్లోలం రేపుతోంది. కరోనా ట్రీట్మెంట్ కోసం రమేశ్ హాస్పటల్ నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్‎లో అగ్ని ప్రమాదం ఘటన దరిమిలా… కుల రాజకీయాలకు ఆజ్యం పోసినట్టయ్యింది. రమేశ్ హాస్పటల్‎ని ఆ వర్గం వారే నిర్వహిస్తున్నారు కాబట్టే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తుంటే… తప్పులను వేలెత్తి చూపిస్తుంటే ఉలికెందుకంటూ అధికారపక్షం ప్రత్యారోపణలతో అమరావతి సాక్షిగా కుల కల్లోలం రేగింది. దీంతో అసలు వ్యవహారమంతా ఒక సామాజికవర్గం తీరు వల్లే జరుగుతుందా అన్న చర్చ మొదలయ్యింది. ప్రజలకు సేవలందిస్తున్న తమపై… కులం ముద్ర వేయడమేంటని… కొందరు ప్రతిపక్ష నేతలు ఇప్పుడు వాయిస్ రెయిజ్ చేస్తున్నారు. అయితే కృష్ణా జిల్లాలో ఆ వర్గం చుట్టూనే ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయన్నది చాలా ఇంటరెస్టింగ్ టాపిక్… ఒకసారి వర్తమానంలోంచి చరిత్రను తెలుసుకుందాం.

Caste "Ram" Bhajan spreads in Andhra Pradesh ?? part 2
caste politcs in ap

వ్యవస్థలపై అదుపు వారికే

అయినోళ్లకు కంచాల్లో కాని వాళ్లకు ఆకుల్లో… ఇది కృష్ణా జిల్లాలో ఆ వర్గం జనం యాటిట్యూట్… రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆ సామాజికవర్గం ప్రజలు ఉన్నప్పటికీ… కృష్ణా జిల్లా వారు మాత్రం అందరికీ భిన్నం. చొరవ, దూకుడు, టెంపరితనంతోపాటు… మిగతవారికి లేని కొన్ని అరుదైన క్వాలిటీస్ వారిలో ఎక్కువని… ఇతర జిల్లాల్లోని ఆ వర్గం వారే గుసగుసలాడుతుంటారు. అందరిని చెప్పు చేతల్లో తీసుకోవాలన్న వైఖరే ఇప్పుడున్న పరిస్థితికి కారణమంటారు. కృష్ణా జిల్లా వారి వైభవం తెలుగు దేశం పార్టీ ఏర్పాటుకి ముందు.. తర్వాత అని మాట్లాడుకోవాల్సిందే. వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో వారు వ్యవస్థలను శాసించేవారు. మీడియా, విద్యా, వైద్యరంగాల్లో వారి ముద్ర సుస్పష్టం. చివరకు సెలూన్ల ఫ్రాంచైజీలు నిర్వహిస్తుండటం విశేషం. ఈ మాట చెప్పడం ఎందుకంటే వారు లేని రంగం లేదనడం కోసమే.

Caste "Ram" Bhajan spreads in Andhra Pradesh ?? part 2
krishna dist map

రాజధాని…. రాజకీయాలు

రాష్ట్ర విభజనకు ముందు.. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జిల్లా ఆ సామాజికవర్గం వారి గురించి ప్రముఖంగా చెప్పుకోవాల్సిందే… రాష్ట్ర ఏర్పాటు తర్వాత విజయవాడకు రావాల్సిన రాజధాని కర్నూలుకు పోయిందంటే అందుకు చాలా లాజిక్కులే చెబుతారు. నాడు నీలం సంజీవరెడ్డి రోల్ గురించి విమర్శలున్నా… అందుకు కారణం కూడా చాలా గట్టిగానే చెబుతారు. ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కారుకులెవరన్న ఇష్యూ ఇప్పుడెందుకని అనుకుంటున్నారా… అందుకు కూడా కృష్ణా జిల్లాలోని ఆ జనమేనట… తెలంగాణ సమాజాన్ని నాడు కొందరు ఎంతగా రెచ్చగొట్టారో చూశాం. ఆంధ్ర ప్రాంతానికి మంచి చేయాలనుకున్నవారెవరూ కూడా వాస్తవానికి తెలంగాణ పట్ల అలా అనుచిత వ్యాఖ్యలు చేసుండరు. రాష్ట్రాన్ని సక్సెస్ ఫుల్‎గా విడగొట్టాక… కాంగ్రెస్ పార్టీ ఆడిన నాటకంలో కృష్ణా జిల్లా రాజకీయాల పాత్ర చాలా ఎక్కువే.

Caste "Ram" Bhajan spreads in Andhra Pradesh ?? part 2
vijaywada airport

హైదరాబాద్ వయా విజయవాడ

హైదరాబాద్ కేంద్రంగా పాలన మొదలుపెట్టిన చంద్రబాబు… కేసీఆర్ తీరును నిరసిస్తూ… సమర్థవంతంగా పాలన సాగిస్తున్న ఫీలింగ్ కలిగించారు. ఒకసారైతే… తెలంగాణలో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామంటూ కూడా మాట్లాడారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‎పై పదేళ్లపాటు ఏపీకి హక్కు ఉందని… దాన్ని ఎవరూ కాదనలేరంటూ కేసీఆర్‎తో ఢీకొట్టారు. కానీ ఇంతలో ఓటుకు నోటు వ్యవహారం తెరపైకి రావడంతో తట్టా బుట్టా సర్దేసుకొని విజయవాడకు మకాం మార్చేయడంతో కృష్ణా జిల్లా కేంద్రమైన విజయవాడలోనే వ్యవహారాలు మొదలైపోయాయ్. ఇక చంద్రబాబు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కార్యాలయాన్నే సీఎంవోగా మార్చేసుకోవడం చకచక జరిగిపోయాయ్.

Caste "Ram" Bhajan spreads in Andhra Pradesh ?? part 2
chandra babu file photo

కులం ఆపాదిస్తున్నారంటున్న చంద్రబాబు

అప్పటి వరకు చంద్రబాబు అడ్మిస్ట్రేటర్, సీఈవో ఇలా చాలా బిరుదులు పేరుకు ముందు విన్పించేవి. కానీ… ఎప్పుడైతే చంద్రబాబు, దేవినేని ఉమ కార్యాలయంలోకి ఎంటరయ్యారో అప్పట్నుంచి సీన్ మారిపోయిందంటారు. వారు వీరు… వీరు వారవుతారన్న నానుడి ఇక్కడ ఇంప్లిమెంట్ అయిపోయిందని కొందరు చెవులు కొరుక్కుంటారు. అదే సమయంలో పార్టీలో లోకేశ్ యాక్టివ్ అయ్యే కొద్దీ ఆ జాఢ్యం పరవల్లు తొక్కిందంటారు. ఈ సమయంలో ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఒకసారి గుర్తుచేసుకోవాలి. హైదరాబాద్‎లో ఉన్నంత కాలం ఎవరు కూడా… తన కులం గురించి మాట్లాడలేదని… ఇప్పుడేమో కులం ఆపాదిస్తున్నారన్నారు. అలా ఎందుకు ఆయనను విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదని చంద్రబాబు చెప్పడం విడ్డూరమే. ప్రపంచంలో దాన్నో వింతగా చూడాలి మరి!

author avatar
DEVELOPING STORY

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju