YS Jagan Big Plan: అయిననూ విశాఖకు పోవలె.. కోర్టు నుండి తప్పించుకొనవలె.. జగన్ మైండ్ లో బెస్ట్ ప్లాన్..!!

YS Jagan Big Plan: Internal Plan Shift Capital
Share

YS Jagan Big Plan: జగన్ సీఎం అయ్యాక తీసుకున్న అతి పెద్ద నిర్ణయాల్లో మూడు రాజధానులు మొదటిది.. ఏపీకి అత్యంత ప్రాధాన్యమైనది అదే.. ఏపీలో ఇప్పుడు అత్యంత సంక్లిష్ట అంశంగా మారినది అదే.. 2019 నవంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం మదిలోకొచ్చి, 2020 ఫిబ్రవరిలో ఆమోదం పొందిన ఈ మూడు రాజధానుల నిర్ణయం ఇప్పటికీ అమల్లోకి రావడం లేదు. ఏడాది కిందట కోర్టు స్టే ఇవ్వగా.., ఇప్పటికీ విచారణ దశలో ఉంది. ఎప్పుడు తేలుతుందో కూడా స్పష్టత లేదు. జగన్ పగ్గాలు చేపట్టి సగం నెలలు కావస్తున్నా, ఇప్పటికీ రాజధాని అంశం తేలడం లేదు.. ఇది వైసిపికి, సీఎం జగన్ కీ పెద్ద ఇబ్బందికర అంశమే.. అందుకే ఆయన గేరు మార్హ్చారు, వ్యూహం మార్చారు. కోర్టుకి దొరకకుండా లాజికల్ గా, ఐడియాలజిగా విశాఖని పాలనా రాజధానిగా చేసే వ్యూహాన్ని అమలు చేసే పనిలో పడ్డారు..!

YS Jagan: Big Plan to Shift Capital
YS Jagan Big Plan: Big Plan to Shift Capital

YS Jagan Big Plan: సీఎం ఎక్కడున్నా పర్వాలేదు..! అనే సూత్రం బయటకు…

సీఎం ఎక్కడైనా ఉండవచ్చు. ఎక్కడి నుండైనా పరిపాలించవచ్చు. అది ఆయన ఇష్టం. రాజ్యాంగంలో సీఎం ఫలానా ప్రదేశం నుండే, రాజధాని నుండే పరిపాలించాలి అని లేదు. సీఎం ఎక్కడ ఉంటె అదే పరిపాలన కేంద్రం. ఇక్కడ వరకు స్పష్టం.. కాకపోతే ఒక సంప్రదాయం ప్రకారం మన దేశంలోని అందరు సీఎంలు ఆయా రాష్ట్రాల రాజధానుల నుండి మాత్రమే పరిపాలిస్తుంటారు.. సీఎం పరిపాలిస్తున్న ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించకుండా, పనులు చేసుకోవచ్చు. అలా ప్రకటించాలి అంటే న్యాయ, రాజ్యాంగ సూత్రాలు అడ్డు వస్తాయి. అందుకే సీఎం జగన్ ఇప్పుడు వ్యూహాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. పరిపాల మొత్తం విశాఖకు తరలించి.. ఆయన అక్కడి నుండి పాలన మొదలు పెట్టి.., పరిపాలన రాజధాని అనే పేరు పెట్టకుండా, అనధికారికంగా మొత్తం అమలు చేసేస్తారు. సీఎం ఇష్టప్రకారం ఎక్కడి నుండి అయినా పాలించవచ్చు కాబట్టి.., ఇది కోర్టు ధిక్కరణ కాదు. కోర్టుల నుండి అనుమతులు వచ్చిన తర్వాత రాజధానిగా అధికారికంగా గెజిట్ ఇవ్వనున్నారు..

YS Jagan: Big Plan to Shift Capital
YS Jagan Big Plan: Big Plan to Shift Capital

భవనాలు కట్టుకోవచ్చు.. కానీ..!

ఇదే అంశం ప్రకారం చూసుకుంటే విశాఖలో పరిపాల సౌలభ్యం కోసం భవనాలు కూడా నిర్మించుకోవచ్చు. సీఎం కి ఎక్కడైనా గెస్ట్ హౌస్ లు ఉండవచ్చు. జిల్లాకి ఒకటి పెట్టుకోవచ్చు. ఆ క్రమంలోనే విశాఖలో ఒక సీఎం క్యాంపు ఆఫీస్ పెట్టుకుని.. పరిపాలన షురూ చేయాలని భావిస్తున్నారట.
* దీనిపై ఇటీవల ఢిల్లీ టూర్ లో కేంద్రానికి స్పష్టత ఇచ్చారట. “మీ రాజధాని మీ ఇష్టం. కేంద్రం జోక్యం చేసుకోదు అని పెద్దలు స్పష్టం చేశారు”. అనంతరం సీఎం జగన్ ఏపీ గవర్నర్ ని కలిసి కూడా ఇదే విషయాన్నీ స్పష్టం చేసినట్టు సమాచారం. రాజధాని విషయంలో కోర్టులు చేయాల్సినవి, కోర్టులు చేయగా.. ప్రభుత్వం చేయాల్సింది ప్రభుత్వం చేసుకోడానికి సిద్ధంగా ఉంది.
* కోర్టులు ఏ మేరకు దీన్ని పరిగణిస్తాయి. ఏమైనా ధిక్కారణగా భావిస్తాయా..!? టీడీపీ/ అమరావతి పోరాట సమితి చూస్తూ ఊరుకుంటుందా..!? కోర్టులో పిటిషన్ వేయకుండా ఉంటుందా..!? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. మొత్తానికి ఈ వ్యవహారం మరో పెద్ద వివాదానికి దారి తీసేలాగే ఉంది..


Share

Related posts

జగన్ కు సుప్రీం కోర్టు మరో షాక్..! ఏమున్నా అక్కడే తేల్చుకోండి

arun kanna

సమాధానం వెతుక్కుంటున్న జనసేన..!

somaraju sharma

టైగర్ కి టైమొచ్చింది… ఫుల్ జోష్ లో హైదరబాద్ పోలీసులు

siddhu