NewsOrbit
హెల్త్

వ్యాయామం ఏ సమయం చేస్తే మంచిదో తెలియడం లేదా…అయితే ఇది మీకోసమే…

వ్యాయామం ఏ సమయం చేస్తే మంచిదో తెలియడం లేదా...అయితే ఇది మీకోసమే...

ప్రపంచవ్యాప్తం గా అనేక మంది అధిక బరువు సమస్య ఎదురుకుంటున్నారు. శారీరకం గా శ్రమ లేకపోవడం ఆహార నియమాలు లేకపోవడం దీనికి కారణం గా చెప్పవచ్చు. బరువు తగ్గాలనే దృఢ సంకల్పంమీకు ఉంటే సాధారణ వ్యాయామం కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు. ఆహారం లోమార్పులు చేయడం, వ్యాయామం ద్వారా శరీర బరువుకోల్పోవడం జరుగుతుంది.

వ్యాయామం ఏ సమయం చేస్తే మంచిదో తెలియడం లేదా...అయితే ఇది మీకోసమే...

ఏ సమయం లో చేసే వ్యాయామం ద్వారా బరువు తగ్గుతాము అనేఅనుమానము తప్పకుండ కలుగుతుంది. కొందరు  ఉదయాన్నే వ్యాయామం చేయడం వలన  మనస్సు ప్రశాంతం గా ఉంటుంది దాని ద్వారా  ఒత్తిడి తగ్గుతుంది అని అనుకుంటారు . ఇంకొందరు , రోజంతా చేసి పనులతో సాయంత్రానికి అలసిపోతాం కాబట్టి ఆ సమయంలో వ్యాయామం చేస్తే అలసట నుండి ఉపశమనంపొందుతామని  అనుకుంటారు . అయితే ఉదయం లేదా సాయంత్రం ఏ సమయం లో వ్యాయామం చేయాలి? ఏ సమయంలో వ్యాయామం చేయడం వలన ఎలాంటి ప్రయోజనాలు పొందుతామో కచ్చితంగా తెలుసుకుని తీరాలి.

ఉదయం సమయం లో వ్యాయామంచేస్తే జీవక్రియ మెరుగ్గ ఉంటుంది. రోజంతా కేలరీల ను ఖర్చు  చేయడానికి ఇది సహాయపడుతుంది. ప్రశాంతమైన  నిద్రకు ఉదయం చేసే వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది.టిఫిన్ తినక ముందు ఉదయం చేసే వ్యాయామం బరువు ను ప్రభావ వంతం గా తగ్గిస్తుంది. అని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది. అంతేకాక, ఉదయాన్నే చేసే వ్యాయామం  త్వరగా మేల్కొనేలా చేస్తుంది.

ఉదయం వ్యాయామం చేస్తున్నపుడు  విడుదలయ్యే ఎండార్ఫిన్లు రోజు ను ఉత్సాహం తో ప్రారంభించే లా చేస్తాయి . ఉదయం చేసే వ్యాయామం వ్యక్తి యొక్క మానసిక స్థితినిమెరుగ్గ ఉంచుతుంది . ఏమి తినకుండా కాలి కడుపుతో వ్యాయామం చేయడం వలన చాలా వేగంగా బరువు తగ్గుతారని అనేక పరిశోధనలు తేల్చి చెప్పాయి . మరి మేము సాయంత్రం మాత్రమే వ్యాయామం చేయగలం ఇప్పుడు ఎలా?దాని వల్ల లాభమా నష్టమా?ఇప్పుడు మేము ఏమి చేయాలి అనేవారికోసం ఇది తెలుసుకోండి.

అన్ఏరోబిక్ లెగ్ ఎక్సర్సైజెస్ సాయంత్రం సమయంలో చేయడం మంచిదని యూరోపియన్ జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజియాలజీలో ప్రచురించిన ఒక వ్యాసంలో పేర్కొంది. సహజం గా సాయంత్రం వేళ్ళలో లో శరీర యొక్క ఉష్ణోగ్రత వెచ్చగా ఉంటుంది. శరీర కండరాలను దృఢంగా నిర్మాణం చేయడానికి ఇదిమంచి సమయం అనే చెప్పాలి. సాయంత్రం సమయం లో చేసే వ్యాయామం వలన టెస్టోస్టెరాన్ యొక్క విడుదల  అధిక స్థాయిలో ఉంటుంది.. ఇది కండరాలను ధృడంగా చేయడానికి ముఖ్య పాత్ర వహిస్తుందని  ‘క్రోనోబయాలజీ ఇంటర్నేషనల్’ అధ్యయనంలో బయటపడింది.

అంటే ఏవిధం గా చుసిన ఉదయం చేసే వ్యాయామం మరియు సాయంత్రం చేసే వ్యాయామం కి కూడా  వేర్వేరు ప్రయోజనాలు ఉన్నాయి అనడం నిజం. కాబట్టి  రోజులో ఏదో ఒక సమయంలో వ్యాయామం చేయడం మాత్రం చాలఅవసరం..కుదిరినవారు రెండుపూట్ల వ్యాయామం చేయండి…కుదరని వారు ఒక్కపూట చేయండి…అబ్బెబే మాకు అస్సలు కుదరదు అనుకునేవాళ్లు కనీసం అరగంట అయినా వ్యాయామం లేదా నడవడం కోసం సమయం కేటాయిన్చడం వలన మంచి మానసిక మరియు శారీరక ఆరోగ్యం మీ సొంతమవుతుంది..కావాలంటే చేసి చూడండి ..

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri