కివీ పండు గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఈ ఫ్రూట్స్ బాగా కనిపిస్తున్నాయి. కివీ పండ్లు తినడానికి కొద్దిగా పుల్లగా, తియ్యగా చాలా రుచికరంగా ఉంటాయి.ఈ పండ్లు రుచిలోనే కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో కూడా మనకు ఎంతగానో మేలు చేస్తాయి. మరి కివీ పండ్లు మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడతాయో తెలుసుకుందామా..
కంటి ఆరోగ్యంలో :
కివీ పండ్లలో లుటిన్ మరియు జియాక్సంతిన్ సమృద్ధిగా ఉంటాయి. లుటిన్ మరియు జియాక్సంతిన్ మక్యూలర్ డిజెనరేషన్ అనే వయస్సుతో పాటు వచ్చే కంటికి సంబంధించిన సమస్యల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.
ఆస్థమాను నయం చేయటంలో :
కివీ ఫ్రూట్ లో విటమిన్ సి మరియు ఆంటీ యాక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. ఈ పండులో ఉండే ఈ గుణాలు ఆస్థమా నుంచి బాధపడేవారికి. త్వరగా ఉపశమనం కలిగిస్తాయి. ఆస్తమా వ్యాధితో బాధపడేవారు కివీ పండు తింటే మంచిది.అలాగే కివీ ఫ్రూట్ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో. సహాయపడుతుంది..శ్వాస తీసుకునేటప్పుడు వచ్చే గురక లాంటి శబ్దాన్ని కూడా తగ్గించటంలో సహాయపడుతుంది.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో :
కివీ పండు తినడం వలన జిర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.కివీ ఫ్రూట్ లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను సులభతరం చేస్తుంది.ఈ ఫ్రూట్ లో ఉండే ఎంజైమ్ ఆక్టినిడిన్ ప్రోటీన్లను బ్రేక్ డౌన్ చేసి జీర్ణ వ్యవస్థలో సహాయపడుతుంది. బరువు తగ్గడంలో కూడా కివీ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే మలబద్దకం సమస్యను నయం చేయటంలో సహాయపడుతుంది.
ఇమ్మ్యూనిటి బూస్టర్ :
కివీ ఫ్రూట్ లో ఉండే విటమిన్ C ఇమ్మ్యూనిటీ ని బూస్ట్ చేయటంలో సహాయపడుతుంది. ఈ పండు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.అలాగే రోజు కివీ పండ్లు తీసుకోవటం వల్ల బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది.ఇంతే కాకుండా గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలైన గుండెపోటు ను తగ్గించటంలో సహాయపడుతుంది.