Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తిరుగులేని ఇమేజ్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. “పుష్ప” సినిమాతో అల్లు అర్జున్ మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. అంతకుముందు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా రాణించారు. “అలా వైకుంఠపురంలో” సినిమా రాకమందు కెరియర్ పరంగా డౌన్ ఫాల్ చూడటం జరిగింది. కానీ “అలా వైకుంఠపురంలో” తో భారీ బ్లాక్ బస్టర్ అందుకొని మంచి జోరుతో “పుష్ప” సినిమా చేసి అంతర్జాతీయ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరో క్రియేట్ చేయండి సెన్సేషన్ రికార్డు అల్లు అర్జున్ నెలకొల్పాడు. విషయంలోకి వెళ్తే ఇంస్టాగ్రామ్ లో అల్లు అర్జున్ 25 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. దీంతో 25 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న తొలి దక్షిణాది నటుడిగా రికార్డులకెక్కాడు.
ఐకాన్ స్టార్ తర్వాత విజయ్ దేవరకొండ (21.3 మిలియన్లు), రామ్ చరణ్ (20.8 మిలియన్లు), దుల్కర్ సల్మాన్ (14.1 మిలియన్లు), యశ్ (13.5 మిలియన్లు), మహేశ్ బాబు (13.4 మిలియన్లు), ప్రభాస్ (11.7 మిలియన్లు), దళపతి విజయ్ (10.8 మిలియన్లు) లకు ఫాలోవర్లు ఉన్నారు. అల్లు అర్జున్ కి మొదటి నుండి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. “పుష్ప” సినిమా తర్వాత అది మరింతగా విస్తరించింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సెకండ్ పార్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
ఈ ఏడాది ఆగస్టు మాసంలో “పుష్ప 2” సినిమా రిలీజ్ కాబోతోంది. మొదటి భాగం కంటే రెండో భాగం చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా అత్యధికమైన ఎక్కువ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. “పుష్ప” మొదటి భాగం పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజ్ చేసిన అప్పట్లో ఎలాంటి ప్రమోషన్స్ ఇతర భాషల్లో చేయలేదు. అయినా గాని హిందీ భాషలో దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. దీంతో “పుష్ప” సెకండ్ పార్ట్ ప్రమోషన్స్ కూడా ఊహించని రేంజ్ లో చేయబోతున్నారట. ఇక ఏప్రిల్ 8వ తారీకు అల్లు అర్జున్ పుట్టిన రోజు నేపథ్యంలో ఆరోజు.. “పుష్ప” సెకండ్ పార్ట్ నుండి సర్ప్రైజ్ ఫ్యాన్స్ కోసం సుకుమార్ రెడీ చేసినట్లు సమాచారం.