Balakrishna: నటసింహ నందమూరి బాలయ్య బాబు వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2021లో “అఖండ” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం జరిగింది. ఆ సినిమా తర్వాత 2022వ సంవత్సరంలో ఎలాంటి సినిమా చేయలేదు. ఆ టైంలో కొత్తగా “అన్ స్టాపబుల్” షో ద్వారా హోస్ట్ గా ఆహా ఓటిటిలో అలరించడం జరిగింది. యాంకర్ గా బాలకృష్ణ మంచి ఎంటర్టైన్మెంట్ అందించడం జరిగింది. దీంతో ఇండియాలో ఓటీటీలో “అన్ స్టాపబుల్” షో నెంబర్ వన్ సానంలో నిలిచింది. ఆ తర్వాత మూడు సీజన్లు విజయవంతంగా రాణించటం జరిగింది.
ఇక గత ఏడాది 2023వ సంవత్సరంలో వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి రెండు సినిమాలతో సూపర్ డూపర్ హిట్ అందుకోవడం జరిగింది. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ విజయాలు బాలయ్య అందుకున్నారు. కాగా ఇప్పుడు దర్శకుడు బాబీ దర్శకత్వంలో… బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “NBK109” పేరిట షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఇటీవల శివరాత్రి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోకి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక బాలయ్యకు తగ్గట్లుగానే ఈ మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ “వీరమాస్” అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా టైటిల్ తో పాటు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు టైటిల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది. బాలయ్య కెరియర్ లో గతంలో టచ్ చేయని జోనర్ తో ఈ సినిమా రూపొందుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్ తో పాటు చాలా ప్రాంతాలలో ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో బాబి డియోల్, ఊర్వశి రౌటేలా నటిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమా విడుదల కాబోతోంది.