Samantha: విడాకులు అనంతరం మరి మన సమంత దశ దిశ తిరిగిపోయిందనే చెప్పుకోవాలి. ఇక టాలీవుడ్లో సామ్ పని అయిపోయిందని అందరూ అనుకొనే క్రమంలో తన తడాఖా ఏంటో చూపించింది సామ్. సాధారణంగా పెళ్లి – విడాకుల తర్వాత హీరోయిన్ల కెరీర్ దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు భావిస్తుంటారు. కానీ సామ్ జీవితం దానికి అపోజిట్ లో దూసుకుపోతోంది. ఓవైపు సినిమాలు కమిట్ అవుతూనే.. మరోవైపు పలు కమర్షియల్ బ్రాండ్ ఎండార్స్మెంట్ కు సైన్ చేస్తూ రెండు చేతుల నిండా బాగా సంపాదిస్తోంది.
Samantha : ఇది నిజమేనా…ఎన్నాళ్లకు సామ్ చైతూ ఫోటో పెట్టిందో.?
Samantha: బ్రాండ్లు వెనుక బాలీవుడ్ కథ:
ఇటీవల కాలంలో ‘బ్లెండర్స్ ప్రైడ్ సౌత్’, ‘ఫాంటా’, ‘మామఎర్త్’, ‘డ్రీమ్ 11’ మరియు ‘ఫార్చ్యూన్’ సన్ ఫ్లవర్ ఆయిల్ వంటి బ్రాండ్స్ కు సమంత ప్రచారకర్తగా మారిన సంగతి విదితమే. వరుస సినిమాలతో పాటు యాడ్స్ తో బిజీగా మారడం వెనుక ముంబై టీమ్ ఉందని బయట టాక్ నడుస్తోంది. సాధారణంగా టాలీవుడ్ లో ఏ హీరోయిన్ వ్యవహారాలైనా మేనేజర్లు చూసుకుంటూ ఉంటారు. అయితే దానికి భిన్నంగా ముంబైలో ఈ వ్యవహారాలు చూసుకోవడానికి కాస్టింగ్ మరియు ఆర్టిస్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు ఉంటాయి. ఇవి స్టార్ హీరోయిన్ల కోసం వర్క్ చేస్తూ వారికి సినిమా అవకాశాలు రావడానికి, ఎండార్స్మెంట్స్ ఇప్పించడానికి కృషి చేస్తుంటాయి.
Samantha-Naga Chaitanya: చైతు ఫోటోను షేర్ చేసిన సమంత.. విడుకుల తర్వాత తొలిసారి ఇలా..?!
సామ్ బాలీవుడ్ ప్లాన్?
అందువలనే సమంత ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టునట్టు తెలుస్తోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సామ్.. ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకొనే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే ముంబైలోని ఓ ఏజెన్సీతో అగ్రిమెంట్ చేసుకుందని రూమర్స్ వస్తున్నాయి. సమంతతో పెద్ద బ్రాండ్లకు సైన్ చేయించడం దగ్గర నుండి పెద్ద నిర్మాణ సంస్థల్లో అగ్ర దర్శకుల్లో ప్రాజెక్ట్స్ సెట్ చేయడం వరకూ అన్ని వ్యవహారాలను ఇప్పుడు ఈ ఏజెన్సీ చూసుకుంటుందని అంటున్నారు. అందుకే పూర్తిగా అక్కడికి మకాం మార్చేస్తోంది.