NewsOrbit
న్యూస్

ఆ పోస్టు మాకు వద్దే వద్దు సార్ ! చంద్రబాబు, జగన్ లకు ముఖం మీదే చెప్పేస్తున్న నాయకులు!!

ఎంపీ అంటే ఏడుగురు ఎమ్మెల్యేల పైన ఉండే వాడు. కాబట్టి సహజంగానే అతనికి సీన్ ఎక్కువ ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ ఏపీలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉందట.

 We do not want that post sir! Leaders who say your face to Chandrababu and Jagan
We do not want that post sir! Leaders who say your face to Chandrababu and Jagan

ఎమ్మెల్యేలను పట్టించుకునే ఎమ్మెల్యేలు ఎవరూలేరు అట!2014 నుంచి ఎంపీలకు ఇలాంటి దుస్థితి ఎదురవుతోందని చెప్పవచ్చు.అంటే అప్పుడు టిడిపి హయాంలోనైనా, ఇప్పుడు వైసీపీ జమానాలో నైనా ఎంపీలు చెల్లని కాసులుగా మిగిలిపోతున్నారని అర్థం.దీనికి కారణం ఈ రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలు కావడమే అంటున్నారు.జాతీయ పార్టీ ఎంపీల కైతే ఢిల్లీ స్థాయిలో పరపతి ఉంటుంది.వారు పార్టీ హైకమాండుకు దగ్గరగా ఉంటారు.ప్రాంతీయ పార్టీ విషయాలు విషయానికొచ్చేసరికి ఆయా పార్టీలు ఎమ్మెల్యేలను ఎక్కువగా పట్టించుకుంటాయి.ఎంపీలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు.2004, 2009ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీలు ఎక్కువగా గెలిచారు.

అయితే అప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండటం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లో ఉండడంతో ఎంపీలకు ఎమ్మెల్యేలు ప్రాధాన్యం ఇచ్చేవారు.అందువల్ల ఎంపీలు హ్యాపీగా ఉండేవారు.ఎమ్మెల్యేలు కూడా ఎంపీలను తమ నియోజకవర్గాలకు తీసుకెళ్లి తమ పనులు చేయించుకునేవారు.2014 ఎన్నికల్లో టిడిపి ఎంపీలు ఎక్కువగా గెలిచారు .రాష్ట్రంలో కూడా టిడిపి అధికారంలోకొచ్చింది.2014 నుంచి ఏపీలో ఎంపీల పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలతో చాలా ఇబ్బంది పడేవారు. తమ నియోజకవర్గాల్లో వేలు పడితే ఒప్పుకునే వారు కారు. కనీసం తమ నియోజకవర్గాల్లో పర్యటించమని కోరడం కూడా జరిగేది కాదు. ముఖ్యమంత్రి పర్యటన ఉంటేనే తప్ప వేదికలపై ఎంపీలకు చోటు ఉండేది కాదు. ఎంపీ ల్యాడ్స్ ను కూడా ఎమ్మెల్యేలు లైట్ గా తీసుకున్నారు. కేశినేని నాని, మురళీ మోహన్, శివప్రసాద్ వంటి ఎంపీలు అప్పట్లో ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై అప్పట్లో చంద్రబాబుకు అనేకమంది ఎంపీలు వ్యక్తిగతంగా కలసి ఫిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పేమీ రాలేదు.2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీలు 22 మంది ,ఎమ్మెల్యేలు 151 మంది గెలిచారు.ఇప్పుడు పరిస్థితి ఎలా తయారయిందంటే ఎంపీలను లెక్కచేసే ఎమ్మెల్యేలు లేకపోగా వారిని ఇబ్బంది పెడుతున్న వైసీపీ శాసన సభ్యులు ఎక్కువగా ఉన్నారు.

ముఖ్యమంత్రికి సన్నిహితంగా మెలిగే బాపట్ల ఎంపి నందిగామ సురేష్ బాబు లాంటి వారిని మినహాయిస్తే ఎక్కువ మంది ఎంపీలు అసంతృప్తిగానే ఉన్నారు.జగన్ విషయానికొస్తే ఆయన ఎమ్మెల్యేలు కూడా పెద్ద సీన్ ఇవ్వకపోయినా ఎంపీలను అసలు గుర్తించడం లేదంటారు.గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా పనిచేసి వైసీపీలో కొచ్చి గెలిచిన మాగుంట శ్రీనివాసులరెడ్డి ,బాలసౌరి వంటి వారు ఈ తేడాను స్పష్టంగా గమనిస్తున్నారు.మరికొందరు ఎంపీలు తమ గోడును బయటపెడుతునా జగనేమీ పట్టించుకోవడం లేదనే సమాచారం ఉంది.దీంతో ఎమ్మెల్యే పదవి బెస్టు ఎంపీలు వేస్ట్ అని వారు వాపోతున్నారు

author avatar
Yandamuri

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N