NewsOrbit
టాప్ స్టోరీస్

బిజెపికి ‘చిరు’ వరం

అమరావతి: ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని భారతీయ జనతా పార్టీలోకి చేర్చుకొని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనపై ఈ రకంగా వస్తున్న వదంతులపై ఇంత వరకూ చిరంజీవి స్పందించి వివరణ కూడా ఇవ్వలేదు. బిజెపిలోకి ఆయన్ను చేర్చుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు పావులు కదుపుతున్నారన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. చిరంజీవి బిజెపిలోకి వస్తే స్వాగతిస్తామంటూ ఆ పార్టీ మాజీ మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

2024 ఎన్నికల నాటికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బలమైన శక్తిగా ఎదగాలని బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు కూడా వెల్లడిస్తున్నారు.

ఈ క్రమంలో భాగంగా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బిజెపి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. రెండు రాష్ట్రాల్లోని సీనియర్ నేతలపై దృష్టి పెట్టింది. సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బలం పెంచుకోవాలని బిజెపి భావిస్తోంది. ఇప్పటికే అక్కడ, ఇక్కడ పలువురు సీనియర్ నేతలు కమలం గూటికి చేరిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పరిస్థితి దారుణంగా ఉన్న నేపథ్యంలో ఈ పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండదని కొందరు నేతలు భావిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని సీనియర్ నేతలకు బిజెపి గాలం వేస్తోంది. తమను బిజెపిలోకి రమ్మని అడిగారంటూ అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి  బహిరంగంగానే వెల్లడించారు. ఈ క్రమంలో భాగంగా ఇప్పుడు బిజెపి అగ్రనాయకత్వం చిరంజీవిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ వదంతులు వినిపిస్తున్నాయి.

చిరంజీవిని పార్టీల చేర్చుకుంటే ఆయన సోదరుడు, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కూడా బిజెపి తీర్థం పుచ్చుకుంటారనీ,  లేదంటే ఆ పార్టీ మద్దతుతో తన పార్టీని కొనసాగిస్తారనే వార్తలు కడా వినిపిస్తున్నాయి.

ఇటీవల తానా సభలకు వెళ్లిన సమయంలో పవన్ కళ్యాణ్ అక్కడ బిజెపి నేత రామ్ మాధవ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఈ రకమైన డీల్ కుదరిందనే పుకార్లు వచ్చాయి. అయితే ఈ వార్తలను పవన్ కళ్యాణ్ ఖండించారు.

2009 ఎన్నికల తర్వాత పిఆర్‌పిని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్‌లో చేరారు.  2014 ఎన్నికల అనంతరం క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ సినీ రంగంపైనే దృష్టి కొనసాగిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల ముందే చిరంజీవి కాంగ్రెస్‌ను వీడి బిజెపిలోకి వెళతారనే ప్రచారం జరిగింది కానీ, ఆయన మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారాలలోనూ పాల్గొనలేదు. ప్రస్తుత రాజకీయ పరిమాణాల నేపథ్యంలో చిరంజీవి విషయంలో బిజెపి పాచిక పారుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment