(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కోల్కతాలోని ఓ బిల్డింగ్ నుంచి నోట్ల కట్టల వర్షం కురిసింది. బెంటిక్ స్ట్రీట్లో ఉన్న హోక్యూ మర్కన్టైల్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఆఫీసు బిల్డింగ్లో డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఆరవ అంతస్తు నుంచి కొందరు నోట్ల కట్టలను బయటకు విసిరేశారు. బుధవారం బిల్డింగ్ నుంచి రెండు వేలు, ఐదు వందలు, వంద రూపాయల నోట్ల కట్టలు బయటపడుతున్న దృశ్యాలు రికార్డు అయ్యారు. బిల్డింగ్లో ఓ ప్రైవేటు కంపెనీ ఆఫీసులో సోదాలు చేసేందుకు డీఆర్ఐ అధికారులు అక్కడకు వెళ్లారు. ఆ సమయంలో ఆరవ అంతస్తులోని కిటికీలోంచి నోట్ల కట్టలను విసిరేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీనిని అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కిందపడ్డ నోట్ల కట్టలను కొందరు సేకరిస్తున్న దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి.
#WATCH Bundles of currency notes were thrown from a building at Bentinck Street in Kolkata during a search at office of Hoque Merchantile Pvt Ltd by DRI officials earlier today. pic.twitter.com/m5PLEqzVwS
— ANI (@ANI) November 20, 2019
ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. డబ్బు వెదజల్లే బదులు సుంకం కట్టిఉంటే ఈ తిప్పలు ఉండేవి కాదు కదా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.