NewsOrbit
టాప్ స్టోరీస్

పాత వీడియోతో దుష్ప్రచారం

‘‘ముస్లిం మహిళల్లా కనిపించే కొంతమంది బురఖాలు ధరించి ఓట్లు వేయడానికి క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు. అంతలో అక్కడకు మరో మస్లిం మహిళ వచ్చారు. వారి వద్ద ఉన్న ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు కార్డులను పరిశీలించారు. తీరా చూస్తే, కార్డులలో ఉన్నదొకరు, అక్కడ లైనులో ఉన్నది మరొకరు’’… ఇలా చెబుతూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ముజఫర్ నగర్ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన ముస్లిం మహిళా కార్యకర్త ఈ బోగస్ ఓటర్లను పట్టుకున్నారని అందులో చెప్పారు. అక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సంజీవ్ బల్యాన్ కూడా ఇదే తరహా ఆరోపణలు ఇంతకుముందు చేశారు. ఆయన చెప్పినది నిజమని చూపించేందుకు బురఖాలలో ఉన్న మహిళల పాత బొమ్మలను తీసుకుని వాటిని ప్రస్తుత ఎన్నికలలో ఓట్లు వేస్తున్నవారిలా చూపించారు.

‘‘నకిలీ ఓట్లు వేస్తూ ముస్లిం మహిళలు పట్టుబడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఇలా జరుగుతోంది. నరేంద్రమోదీని ఇలాగే ఓడిస్తారా? ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది?’’ అని మరో వీడియోకు కామెంట్ పెట్టారు. ఈ వీడియోలు వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ ఎప్పటిదీ వీడియో?
వీడియోలో ఉన్న గొంతును ఎవరైనా జాగ్రత్తగా వింటే అసలు విషయం తెలుస్తుంది. మొదటి కొద్ది సెకండ్లలోనే ఆమె తన పేరు, పార్టీ పేరు చెబుతారు. ‘‘నేను బీఎస్పీ అభ్యర్థి శైలాను’’ అని ఆమె చెబుతుంటారు. ఆల్ట్ న్యూస్ అసలు శైలాఖాన్ అనే మహిళ ఎప్పుడు పోటీ చేశారని చూస్తే, 2017 సంవత్సరంలో రాంపూర్ మునిసిపాలిటీ చైర్ పర్సన్ గా బహుజన సమాజ్ పార్టీ ఆమెను నిలబెట్టినట్లు తేలింది. ‘శైలాఖాన్ బీఎస్పీ ఫేక్ ఓటింగ్ రాంపూర్ ఎలక్షన్స్’ అని సెర్చ్ చేస్తే, ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వీడియో యూట్యూబ్ లో బయటపడింది. దానికి ‘రాంపూర్ నగర్ నికాయ్ ఎలక్షన్ చీటింగ్’ అని టైటిల్ ఉంది.

https://youtu.be/HLtskmgRKMs

 

ఆ ఘటన గురించిన కథనాలు ఏవీ పెద్దగా కనిపించలేదు గానీ, శైలాఖాన్ అనే మహిళ బీఎస్పీ కార్యకర్తేనని మాత్రం తేలింది. బీఎస్పీ ప్రచార పోస్టరులో ఆమె ఫొటో కూడా ఉంది.

https://www.facebook.com/photo.php?fbid=1744126182338934&set=a.132523683499200&type=3

ఇంటర్ నెట్ లోంచి ఒక పాత వీడియో తీసుకుని, దాన్ని ప్రస్తుత ఎన్నికలకు సంబంధించినదిగా చూపించి ప్రచారం చేసేస్తున్నారు. అలాగే, వీడియోలో ఉన్న మహిళ కూడా బీఎస్పీ కార్యకర్తే తప్ప బీజేపీ కార్యకర్త కాదు. ముజఫర్ నగర్ లో ఇలా జరుగుతోందని అక్కడి అభ్యర్థి సంజయ్ బల్యాన్ ఆరోపించిన తర్వాత దాన్ని నిజమని నమ్మించేందుకు జరిగిన ప్రయత్నాలలో ఇది రెండోది.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment